‘కరోనా’ రాకుండా ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..?
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న పదం.. ‘కరోనా’. చైనా, జపాన్, ఇటలీ, సౌదీ, జర్మనీ, అమెరికా వంటి సంపన్న దేశాలు సైతం కరోనా పేరు వింటేనే వణికిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే కొన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలను తమ ఇళ్లను విడిచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. ఈక్రమంలో కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ పనులు చేయాలి?, ఏ పనులు చేయకూడదు..? మొదలైన విషయాల గురించి ప్రభుత్వాలతో పాటు ప్రముఖ ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలోనూ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వృత్తిరీత్యా రోజూ ఇంటి నుంచి పని ప్రదేశాలకు ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బస్సులు, ఎంఎంటీఎస్‌లు, మెట్రోలు.. వంటి ప్రజా రవాణాలో ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వాళ్లు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందామా..!
Know More