సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కాఫీ పిప్పిని ఇలా కూడా వాడచ్చు..!

ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ బద్ధకాన్ని వదిలించుకొనే అలవాటున్న వారు చాలామందే ఉంటారు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కూడా కాఫీని ఆశ్రయించేవారు బోలెడంతమందే..! కాఫీ తాగడం వరకు బాగానే ఉంది.. కానీ వాడేసిన కాఫీ పొడిని వృథాగా పడేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈసారి మాత్రం అలా చేయకండి.. ఎందుకంటే కాఫీ వడకట్టగా మిగిలిన పిప్పిని పెరటి మొక్కలకు ఎరువుగా, కీటకనాశనిగా ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో టెర్రస్, బాల్కనీలతో పాటు ఇంట్లోనూ మొక్కలను పెంచుతున్నారు. ఇలాంటి మొక్కలకు రసాయనిక ఎరువులు ఉపయోగిస్తే వాటి ప్రభావం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటికి సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించడం మంచిది. దీనికోసం ఒకసారి వాడిన కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ÂÃX¶Ô XÏXÏpE ƒ©Ç Â¹ØœÄ „Ãœ¿ÍŒÕa..!

…Ÿ¿-§ŒÖ¯äo ©ä* ÂÃX¶Ô ÅÃ’¹ÕÅŒÖ ¦Ÿ¿l´-ÂÃEo «C-L¢-ÍŒÕ-Âí¯ä Æ©-„Ã{ÕÊo „ê½Õ ÍéÇ-«Õ¢Ÿä …¢šÇª½Õ. X¾E ŠAhœË ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË.. ÅŒ©-¯íXÏp ÊÕ¢* …X¾-¬Á-«ÕÊ¢ ¤ñ¢Ÿ¿-œÄ-EÂË Â¹ØœÄ ÂÃX¶ÔE ‚“¬Á-ªá¢-Íä-„ê½Õ ¦ð©ã-œ¿¢-ÅŒ-«Õ¢Ÿä..! ÂÃX¶Ô ÅÃ’¹œ¿¢ «ª½Â¹× ¦Ç’Ã¯ä …¢C.. ÂÃF „Ãœä-®ÏÊ ÂÃX¶Ô ¤ñœËE «%Ÿ±Ä’à X¾œä®¾Öh …¢šÇª½Õ ÍéÇ-«Õ¢C. ƪáÅä ¨²ÄJ «Ö“ÅŒ¢ Æ©Ç Í䧌Õ¹¢œË.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÂÃX¶Ô «œ¿-¹-{d’à NÕT-LÊ XÏXÏpE åXª½šË „çṈ©Â¹× ‡ª½Õ-«Û’Ã, ÂÌ{-¹-¯Ã-¬Á-E’à …X¾-§çÖ-T¢-ÍŒÕ-Âî-«ÍŒÕa. ƒšÌ-«L Â颩ð ˜ã“ª½®ý, ¦Ç©ˆ-F-©Åî ¤Ä{Õ ƒ¢šðxÊÖ „çṈ-©ÊÕ åX¢ÍŒÕÅŒÕ-¯Ãoª½Õ. ƒ©Ç¢šË „çṈ-©Â¹× ª½²Ä-§ŒÕ-E¹ ‡ª½Õ-«Û©Õ …X¾-§çÖ-Tæ®h „ÃšË “X¾¦µÇ«¢ «©x ‚ªî-’Ãu-EÂË £¾ÉE ¹Lê’ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. Æ¢Ÿ¿Õê „ÚËÂË ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ‡ª½Õ-«Û©Õ …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ «Õ¢*C. DEÂ¢ ŠÂ¹-²ÄJ „ÃœËÊ ÂÃX¶Ô ¤ñœË ¦Ç’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. ÆŸç-©Ç’î Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

優-ͽÕ-ŸÄ-«Ö.. å„„¾ªî-NÕ-§½Ö!

å„„¾-ªî-NÕ§½Ö NÕJ-§½Ö™ ¿Ù{Õª-¦Ç-EÂË ÍçªC-ÊC.- DE©ð Xçªáu-ÂË-å„j’à ªŒÂÃ-™Õ-¯Ãoªá.- XÚ˩𠄾C,„¾C-æ£ÇÊÕ ªŒÂÃ™Õ ²ÄŸµÄ-ªŒ-ºª’à ƪŸ¿Õ-¦Ç-{Õ©ð …ªšÇªá.- DE ‚Â¿Ù™Õ £¾Ç%Ÿ¿-§½Ö-ÂÃ-ªŒª©ð *ÊoN’à …ªšÇªá.- B’¹©Ç ͽ¿ˆ’à ƙÕx-¿٪-{ÕªC.- XçªœË ÍêŒ-™Åî „¾Ûͽa-ÂÃ-§½ÕÊÕ Å½™-„Ϫ-Íä©Ç …ªœä ªŒÂ¿ª 愪ŒÕ XÃ{ªý XçÕ™¯þ å„„¾-ªî-NÕ§½Ö.- ‡ªŒÕ„¾Û ©äŸÄ XçªœË ªŒª’¹Õ ÆCl-Ê-{Õd’à …ªœäC å„„¾-ªî-NÕ§½Ö Âľ-ꪚÇ.- *Êo ªŒÿsªŒÕ XçῈ©Ç ÆE-„Ϫ-ÍäC å„„¾-ªî-NÕ§½Ö ¿Úx®Ï-¤¶ò-L§½Ö.- *Êo *Êo ‚¿Ù-™Åî ¤Äꠙ¿~ºª …ªœäC å„„¾-ªî-NÕ§½Ö “¤ñæ®dšÇ.- ƒ©Ç ‡¯îo ªŒÂÙÕ, ªŒª’¹Õ©ðx …ª{ÕªC.- ƒC Ž¿و« Xç™Õ-ŽÕ-ªŒÕ-©ðÊÖ Í½Â¿ˆ’à 優ŒÕ-’¹Õ-ŽժC.- Xç™Õ-ŽժŒÕ «ÕK Ž¿و« „¾œ¿Õ-Žժ˜ä ¿%“A«Õ Xç™Õ-’¹ÕÊÕ ÆªCªÍÃL. ‡ªœ¿ ®¾ÖšË’à „¾œ¿E ®¾n™ª©ð 優ͽÕ-Âî-XÃL.- F@Áßx E™-«E, ²ÄªŒ-«ª-Ž-XçÕiÊ, ÅäL¿¤ÄšË «ÕšËd NÕ“¬Á-«Õª©ð ¨ XçῈ ¦Ç’à 優ŒÕ-’¹Õ-ŽժC.- ¯ä™ „¾ÜJh’à ¤ñœË ¦ÇJÊ Å½ªŒ-XÃÅä F@Áßx ¤ò§½ÖL.- ©ðÅ½Õ Å½Â¿Ùˆ-«ÛÊo ¿٪œÎ©ðx 優ͽÕ-Âî-œÄ-EÂË ¨ XçῈ™Õ ÆÊÕ-«Û’à …ªšÇªá.- ˜ã“ªÃE§½Õª©ð, ¦ÇšË©ü ’Ãéªf-Êx©ð, Xä©Çœä Åí˜ãd©ðx 優ͽÕ-¿ٯÃo ͽ¿ˆ’à …ªšÇªá.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala