షాహిద్ కాదు.. అతడే నా ఆల్‌టైమ్ క్రష్!
మన జీవితంలో మనకు ఇష్టమైన వాళ్లు ఎంతమంది ఉన్నా.. తొలిచూపులోనే మన మనసు దోచుకున్న వాళ్లు (క్రష్) మాత్రం ఒక్కరే ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం తన భర్త షాహిద్ మాత్రం కాదంటోంది మీరా రాజ్‌పుత్. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ భార్యగానే కాదు.. తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో తానెంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌కు అనుక్షణం టచ్‌లోనే ఉంటుందీ అందాల అమ్మ. అంతేనా.. వీలు చిక్కినప్పుడల్లా వారితో ముచ్చటిస్తుంటుంది కూడా! అలా తాజాగా ఇన్‌స్టాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించింది మీరా. ఈ క్రమంలో తన భర్త, పిల్లలు, బ్యూటీ సీక్రెట్స్, ఫిట్నెస్.. వంటి బోలెడన్ని విషయాలతో పాటు తన క్రష్ ఎవరో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More