అలా అనకుండా మీరిప్పుడు చప్పట్లు కొట్టాలి!
ప్రస్తుతం ప్రపంచమంతా ‘కరోనా’ జపం చేస్తోంది. లక్షలాది మందిని బలిగొన్న ఈ మహమ్మారి ఎప్పుడెప్పుడు అంతమైపోతుందా అని కోట్లాది మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పలు దేశాల్లో ఈ వైరస్ ఓవైపు మృత్యు తాండవం చేస్తూనే.. మరోవైపు మనకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. నిత్యం యుద్ధాలు, జాత్యహంకార మాటలతో కత్తులు దూసుకునే కొన్ని దేశాలు నేడు ఈ మహమ్మారి కారణంగా ఏకమయ్యాయి. కరోనాపై కలిసి పోరాటం చేద్దామని ముందుకు వస్తున్నాయి. ఇక ఉపాధి కోసం వివిధ దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా.. కుల, మత, జాతి, వర్గ విభేదాలు చూపించకుండా కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. ప్రాణాలను పణంగా పెడుతూ అహర్నిశలూ సేవలందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈక్రమంలో వారి సేవలను ప్రశంసిస్తూ ‘సచిని’ అనే ఓ మహిళా నెటిజన్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Know More