ఎక్కడైనా.. ఎప్పుడైనా.. పిల్లలకు పాలివ్వడానికి మొహమాటమేల?
బిడ్డకు పాలివ్వడం అనే మధురానుభూతి ఓవైపు ప్రసవాంతర నొప్పి, మరోవైపు నిద్రలేమి వల్ల కలిగే చిరాకు.. లాంటి ప్రతికూల పరిస్థితులను మరిపిస్తుందంటోంది బాలీవుడ్ అందాల అమ్మ సమీరా రెడ్డి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తమ అనుభవాలను పంచుకుంటూ మహిళల్లో స్ఫూర్తి నింపిన విషయం తెలిసిందే. ఇదే దారిలో నడుస్తోంది మన సమీర కూడా! తాను మొదటిసారి అమ్మయిన తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కి లోనయ్యానని.. ఆపై దాన్నుంచి బయటపడి అమ్మతనాన్ని ఆస్వాదించానని వెల్లడించిన ఈ సూపర్ మామ్.. గతేడాది నైరా అనే పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే అమ్మతనంలోని మాధుర్యాన్ని మరింతగా ఆస్వాదిస్తూ.. ఈ క్రమంలో తనకెదురైన మధురానుభూతులను, తమ చిన్నారులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది సమీర. అంతేనా.. ఇలా తన పోస్టులతో పిల్లల పెంపకం, బ్రెస్ట్ ఫీడింగ్.. వంటి ఎన్నో విషయాల గురించి.. ఈ క్రమంలో తల్లులు, పిల్లల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ న్యూమామ్స్‌లో ప్రేరణ కలిగిస్తోందీ బ్యూటిఫుల్ మామ్. తాజాగా ‘బ్రెస్ట్ ఫీడింగ్ అలర్ట్ ఫర్ మామ్స్’ అంటూ బిడ్డకు పాలిచ్చే విషయంలో తల్లులు తీసుకోవాల్సిన జాగత్తల గురించి చెబుతూ, బహిరంగ ప్రదేశాల్లోనైనా బిడ్డకు పాలివ్వడానికి తల్లి వెనకాడద్దంటూ మరో స్ఫూర్తిదాయక పోస్టుతో మన ముందుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
Know More