అందుకే మా కల్యాణంలో కన్యాదానానికి చోటివ్వలేదు!
పెళ్లంటే నూరేళ్ల పంట..! రెండు మనసులే కాదు... కొన్ని కుటుంబాల కలయిక! హిందూ సంప్రదాయ వివాహం అనగానే గౌరీపూజ దగ్గర్నుంచి కన్యాదానం, జీలకర్ర-బెల్లం, మాంగల్యధారణ, ఏడడుగులు, తలంబ్రాలు, అప్పగింతలు.. ఇలా రకరకాల పద్ధతులతో కొనసాగుతుంది. మన దగ్గరే కాదు... కాస్త అటూఇటూగా దేశమంతా ఇలాంటి సంప్రదాయ పద్ధతులే పాటిస్తారు. కానీ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి దియా మీర్జా మాత్రం కన్యాదానం, అప్పగింతలను తన పెళ్లి తంతులో పక్కన పెట్టారు. హిందూ సంప్రదాయ ప్రకారం శాస్త్రోక్తంగానే వివాహం చేసుకున్న ఆమె వీటిని మాత్రం ఎందుకు పక్కన పెట్టారో తెలుసుకుందాం రండి.
Know More