నాలో ‘కరోనా’ అలా బయటపడింది!
ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, దగ్గినా, తుమ్మినా వెంటనే.. ‘నాకూ ‘కరోనా’ వచ్చిందేమో.. అందుకే ఇలా అవుతోంది’ అని భయపడే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా కరోనాకు సంబంధించిన వార్తలే వస్తున్న నేపథ్యంలో చాలామందిలో ఏదో తెలియని గుబులు మొదలైంది. మరీ ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రజల్లో ఇలాంటి భయాలను దూరం చేయాలనుకుంది కరోనా బారిన పడి క్రమంగా కోలుకుంటోన్న ఓ 22 ఏళ్ల అమెరికన్ అమ్మాయి. ఈ క్రమంలోనే తన ‘కరోనా అనుభవాలను’ నెటిజన్లతో పంచుకుంది. కరోనా తనను ఎలా అటాక్ చేసింది? రోజురోజుకీ తనలో ఎలాంటి లక్షణాలు కనిపించాయి? అనే విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ అందరిలో ధైర్యం నింపుతోంది. మరి ఆ యువతి పంచుకున్న ‘కరోనా’ అనుభవాల గురించి మనమూ తెలుసుకుందామా..?
Know More