వేసవిలో చర్మ సంరక్షణ.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!
వేసవి అంటేనే సమస్యల వలయం. ఈ కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్.. వంటి ఆరోగ్య సమస్యలే కాదు.. పలు చర్మ సంబంధిత సమస్యలూ ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఇలా ఈ సీజన్లో ఉండే సమస్యలు ఎన్నో..! వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. ఈ క్రమంలో పార్లర్ల చుట్టూ తిరగడం, తమకు తెలిసిన సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం.. ఇలాంటివీ అందులో కొన్ని. అయితే ఇలాంటి చర్మ సంబంధిత సమస్యల్ని అధిగమించాలంటే ముందు వేడి నుంచి బయటపడాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఇందుకోసం సౌకర్యవంతంగా, వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడం మాత్రమే కాదు.. సౌందర్య సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు.
Know More