అట్ల బతుకమ్మ.. అలిగిన బతుకమ్మ.. !
రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబరాలు. మహాలయ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను వారు రోజుకో పేరుతో పిలుస్తూ, తీరొక్క నైవేద్యంతో కొలుస్తారు. మరి ఆ పేర్లేంటో, ఆయా రోజుల్లో అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More