టీవీలోనే కాదు.. టిక్‌టాక్‌లోనూ అలరిస్తాం..!
కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించడంతో విద్యాసంస్థలు, వ్యాపార పరిశ్రమలతో పాటు వినోద రంగం కూడా తాత్కాలికంగా తమ కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి విదితమే. దీంతో సినిమాలు, సీరియళ్లు, రియాల్టీ షోలు.. తదితర కార్యక్రమాలకు సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలో నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే మన బుల్లితెర తారలకు కాస్త విరామం దొరికినట్లయ్యింది. దీంతో వీళ్లు ఇంటి పట్టునే ఉంటూ ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది బుల్లితెర నటీమణులు టిక్‌టాక్ వేదిక ద్వారా ప్రేక్షకులను అలరిస్తుండడం విశేషం. ఈ క్రమంలో డ్యాన్స్, కామెడీ, సినిమా డైలాగుల అనుకరణతో పాటు.. సోషల్ మీడియా ఛాలెంజ్‌లలో పాల్గొనడం, తాము రూపొందించిన వంటలను పరిచయం చేయడం.. తదితర వీడియోలను కూడా టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తు్న్నారు. అలాంటి కొన్ని వీడియోలపై ఓ లుక్కేద్దాం రండి..
Know More