అలాంటి వాళ్లతోనే కలిసి ఉండాలనుకుంటా!
ఇలియానా.. ‘దేవదాస్’ సినిమాతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన ఈ గోవా బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’, ‘రాఖీ’, ‘నేను నా రాక్షసి’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. మధ్యలో వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘పాగల్ పంతి’ తదితర సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక సిల్వర్ స్ర్కీన్‌పై ఎంతో సందడి సందడిగా కనిపించే ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందరితో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘Ask Me Anything’ పేరిట అభిమానులతో ముచ్చటించింది ఇలియానా. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలిచ్చింది. మరి ఇలియానాకు, అభిమానులకు జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
Know More