బంధాన్ని నిలిపేది భర్త ఉద్యోగమేనా..?
‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఎప్పుడోనే చెప్పారు జర్మన్‌కు చెందిన ప్రముఖ తత్త్వవేత్త, ఆర్థికవేత్త కార్ల్‌మార్క్స్. ‘డబ్బుకు ప్రేమ అవసరం లేదు కానీ, ప్రేమకు డబ్బు కావాలి’. ఇది ఓ సినిమాలో హీరో తన ప్రేయసితో చెప్పే డైలాగ్. అయితే ‘బంధాలు నిలిచి ఉండాలంటే కావాల్సింది డబ్బులు కాదు ప్రేమే’, ‘డబ్బులు శాశ్వతం కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమలే శాశ్వతం’ అని మరికొందరు వాదిస్తుంటారు. ఇవి చెప్పడానికే బాగుంటాయి కానీ డబ్బులేనిది ఈ ప్రపంచం ముందుకు నడవదనేది జగమెరిగిన సత్యం. ఇదేదో గాలికి చెబుతున్న మాటలు కావు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ‘భర్త ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులు బంధంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న’ అంశంపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..?
Know More