ఇలా చేస్తే అత్తిల్లూ పుట్టిల్లే..!
అప్పటిదాకా పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా, గారాబంగా పెరిగిన ఆడపిల్ల పెళ్లయ్యాక అత్తింట్లో అడుగుపెట్టగానే ఆమెపై ఎన్నో బరువు బాధ్యతలు వచ్చిపడతాయి. మరి, వాటన్నింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగితేనే అటు పుట్టింటి గౌరవాన్ని, ఇటు మెట్టినింటి అనురాగాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే అప్పుడే అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏ విషయంలో ఎలా మెలగాలో అర్థం కాని పరిస్థితి వారిది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తింటి వారితో నడుచుకునే విధానం, అత్తమామలకిచ్చే గౌరవమర్యాదలు, వారి అభిరుచులేంటి.. వంటివన్నీ తెలుసుకొని ముందుకు సాగితేనే మెట్టినింటిని కూడా పుట్టింటిలా మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత అమ్మానాన్నలుగా భావించే అత్తమామలతో సఖ్యత కూడా ఏర్పడుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. అయితే ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి, అవేంటో తెలుసుకొని ఆచరిస్తే అత్తింటి అనుబంధంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు.
Know More