సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

భార్య అంబాసిడర్‌.. భర్త ఫొటోగ్రాఫర్‌..!

సమాజాన్ని కూడా తమ కుటుంబంగా భావించే మనసు లక్షల్లో ఒకరికి ఉంటుంది. అలాంటి మనసున్న అందమైన జంట రామ్‌ చరణ్‌ - ఉపాసన. వృత్తిపరంగా వీళ్లిద్దరూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాదు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను సైతం తామే స్వచ్ఛందంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వన్య ప్రాణుల సంరక్షణకై విరాళాలు సేకరించే WWF (World Wide Fund for Nature) అనే స్వచ్ఛంద సంస్థ మన రెండు తెలుగు రాష్టాల్లో తమ సంస్థ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపాసనను WWF ప్రచారకర్త (ఫిలాంత్రొపీ అంబాసిడర్‌)గా నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తమ స్వగృహంలో ‘Wildest Dreams’ పేరుతో ఇటీవలే ఓ ఛారిటీ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు సినీ, రాజకీయ, క్రీడా.. తదితర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కావడం విశేషం.

Know More

women icon @teamvasundhara

నిన్న ‘సామజవరగమన’ అన్నారు.. నేడు ‘రాములో రాములా..’అంటున్నారు!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం ‘అల వైకుంఠపురంలో’లోని పాటలు సినీ సంగీత ప్రియుల్ని ఎంతగా అలరిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలోని మొదటి పాట ‘సామజవరగమన’ ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటిలో నానడమే కాదు.. అనతికాలంలోనే యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఇదే సినిమాలోని మరో అద్భుతమైన మాస్‌ పాట ‘రాములో..రాములా..’కి కూడా తాజాగా యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదల కాబోతుంది.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala