సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మన భానుమతి మెహెందీ ఆర్టిస్టుగా మారిపోయింది!

సాయిపల్లవి... సిల్వర్‌ స్ర్కీన్‌పై సహజమైన నటనతో ఆకట్టుకునే ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ప్రేమమ్‌’ సినిమాలో ‘మలర్‌’గా మలయాళ హృదయాలను కొల్లగొట్టినా, ‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్‌ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసినా, ‘రౌడీ బేబీ’ అంటూ యూట్యూబ్‌ రికార్డులు తిరగరాసినా... అది నేచురల్ బ్యూటీ సాయి పల్లవికే చెల్లింది. డాక్టర్ కాబోయి యాక్టర్‌ అయిన ఆమె సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. ప్రకటనల్లో నటించి కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా నో చెప్పి తన ప్రత్యేకతను చాటుకుంది. రీల్ లైఫ్లో ఎంతో సింపుల్‌గా, సరదాగా కనిపించే సాయి పల్లవి నిజ జీవితంలోనూ అలాగే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా షూటింగ్‌ కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామానికి వెళ్లిన ‘మలర్’ సడన్గా మెహెందీ ఆర్టిస్టుగా మారిపోయింది. అక్కడి చిన్నారుల చేతులను అద్భుతమైన మెహందీ డిజైన్లతో నింపి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.

Know More

women icon @teamvasundhara

ప్రసవానంతర సెలవులు వద్దని.. చంటిబిడ్డతో డ్యూటీకి కదిలింది!

పెళ్లయిన మహిళలకు ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం...ఇలా పలు రకాల బాధ్యతలుంటాయి. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా ఉంటుంది. ఒకవైపు ఇంటి బాధ్యతలు..మరోవైపు ఆఫీస్‌ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని... సమానంగా, సమర్థంగా బ్యాలన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా అధికారిణి తల్లి ప్రేమను చాటుకుంటూనే వృత్తి నిబద్ధతను పాటిస్తోంది. మాతృత్వం, వృత్తి ధర్మం తనకు రెండు కళ్లలాంటివి అని చెబుతోన్న ఈ కరోనా వారియర్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

ఈ బుల్లి 'స్పైడర్ మ్యాన్'ని చూశారా?

చిన్నపిల్లలకు కథల పుస్తకాలన్నా, కార్టూన్‌ సినిమాలన్నా చాలా ఇష్టం. టీవీలో ఆ తరహా సినిమాలు చూస్తూనే అందులోని క్యారక్టర్లను అనుకరిస్తుంటారు కొందరు చిన్నారులు. ఈ క్రమంలోనే మార్వెల్‌ సూపర్‌హీరో స్పైడర్‌ మ్యాన్‌ క్యారక్టర్‌ అంటే అబ్బాయిలకు మరీ ఇష్టం. ఆ పాత్రలాగే గోడలపై పాకాలని, వాటి పైనుంచి దూకాలని తెగ ఆరాటపడిపోతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఏడేళ్ల బుడతడిది కూడా ఇదే ఆరాటం. అయితే మొదట్లో జారి కింద పడ్డానని, దెబ్బలు తగిలాయని తన ప్రయత్నాన్ని మానుకోలేదా చిన్నోడు. అలుపెరగకుండా ప్రయత్నించాడు.. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా అచ్చం స్పైడర్‌ మ్యాన్‌లా గోడలు పట్టుకొని అలవోకగా పాకడం, దూకడం నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయాడు.

Know More

women icon @teamvasundhara

ఈ మహమ్మారిని జయించాలంటే మాస్క్‌ మరిచిపోవద్దు!

మాస్క్‌, స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం... కరోనాను సాధ్యమైనంతవరకు కట్టడి చేయాలంటే ఈ మూడింటినీ మన జీవన విధానంలో భాగం చేసుకోవాల్సిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే చాలామంది ఈ జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే ‘మనకేం కాదులే’ అనుకుంటూ కొద్దిమంది ఈ జాగ్రత్తలు పాటించడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. ఈక్రమంలో ఈ చిన్న పాటి అజాగ్రత్తలే అందరినీ సమస్యల్లోకి నెడుతున్నాయని హెచ్చరిస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ట్విట్టర్‌ వేదికగా ఒక యానిమేటెడ్‌ వీడియోను విడుదల చేసింది.

Know More

women icon @teamvasundhara

¨ ¤òM-®¾Õ© «ÕÊ®¾Õ „çÊo!

¹؜¿ÖÐ-’¹Öœ¿Ö ©ä¹ X¶¾Ûšü-¤Ä-Åý-©åXj E«-®Ï¢Íä æXŸ¿„Ã@ÁÙx.. ¹Êo-„ê½Õ X¾šËd¢ÍŒÕÂî¹-¤òÅä ªîœ¿ÕfÊ X¾œ¿f XÏ©x©Õ.. «%Ÿ¿Õl´©Õ... ‡¢Åî-«Õ¢C EªÃ-“¬Á-§Œá©Õ EÅŒu¢ «ÕÊÂ¹× Åê½-®¾-X¾-œ¿Õ-ÅŒÖ¯ä …¢šÇª½Õ. ƪáÅä „ÃJE ֮͌ϯà ͌֜¿-Ê{Õx „çRx-¤ò§äÕ „ê½Õ Âí¢Ÿ¿-éªjÅä, „ÃJE Ÿ¿’¹_-JÂË B®¾Õ-ÂíE ¹œ¿Õ-X¾Û-E¢œÄ ¦µð•Ê¢ åXšËd ÅŒ«Õ «ÖÊ-«-ÅÃyEo ÍÃ{Õ-Â¹×¯ä „Ãª½Õ «ÕJ-Âí¢-Ÿ¿-ª½Õ¢-šÇª½Õ. ¨ 骢œî Âî«-©ðê Í碟¿Õ-Åê½Õ …ÅŒh-ª½-“X¾-Ÿä¬üÂ¹× Íç¢CÊ «ÖEy Æ¯ä «Õ£ÏÇ@Ç ¤òM®ý ÂÃE-æ®d¦Õ©ü. ªîV© ÅŒª½-¦œË A¢œË ©ä¹ Æ©Çxœ¿ÕÅîÊo ‹ «%Ÿ¿Õl´-ªÃ-LE ÆÂ¹×ˆÊ è䪽Õa-ÂíE ¹œ¿ÕX¾Û E¢œÄ ‚£¾Éª½¢ åXšÇd-ªÃ„çÕ. ƒ©Ç ÅŒÊ-©ðE «ÖÊ-«-ÅÃyEo ÍÃ{ÕÂíÊo «ÖEyåXj “X¾®¾ÕhÅŒ¢ ®¾ª½y“Åà “X¾¬Á¢-®¾© •©Õx ¹ת½Õ-²òh¢C. «ÖEy ŠÂ¹ˆêª Âß¿Õ.. ’¹ÅŒ¢-©ðÊÖ ÆŸä ªÃ³ÄZ-EÂË Íç¢CÊ «Õªî ƒŸ¿lª½Õ ¤òM®ý ÂÃE-æ®d-¦Õ@ÁÙx NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅŒ«Õ 殄Ã-’¹Õ-ºÇEo ÍÃ{Õ-ÂíE Æ¢Ÿ¿-J-ÍäÅà ¬Á¦µÇ†ý ÆE-XÏ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «ÕJ, «ÕÊ-®¾¢Åà «ÖÊ-«-ÅŒy¢Åî E¢œË-¤ò-ªáÊ ¨ «á’¹Õ_ª½Õ «Õ£ÏÇ@Ç ¤òM-®¾Õ© ’¹ÕJ¢*Ê “X¾Åäu¹ ¹Ÿ±¿Ê¢ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

ƒ¢C-ª½«Õt «ÕSx «²òh¢C!

¦µÇª½-B-§ŒÕÅŒ …šËd-X¾œä Íä¯äÅŒ <ª½, „çÕœ¿ ÊÕ¢* „çÖÍä-Ōթ ŸÄÂà ¹XÏp …¢œä ‘ÇD ¦÷xèü, ÍäAÂË J®ýd „ÃÍý, ³Äªýd å£Çªáªý å®kd©ü, Ê«Õ-²Äˆ-ªÃ-EÂË “X¾A-Ê-«Õ-²Äˆª½¢.. ƒ©Ç¢šË ‚£¾Éª½u¢ ’¹ÕJ¢* ÍçX¾p-’Ã¯ä «ÕÊ¢Ÿ¿J «ÕC©ð „çÕC-©äC ¦µÇª½ÅŒ „ç៿šË «Õ£ÏÇ@Ç “X¾ŸµÄE ƒ¢C-ªÃ-’âDµ ª½ÖX¾„äÕ. Æ©Ç¢šË X¾«-ªý-X¶¾Û©ü «Õ£ÏÇ@Á ‚£¾ÉªÃuEo X¾ÛºË-ÂË-X¾Û-ÍŒÕa-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. ‚„çÕÂ¹× “X¾A-ª½Ö-X¾¢’Ã, Æ®¾©Õ ®Ï®¾-©ãjÊ „ê½-®¾Õ-ªÃ-L’à æXª½Õ ’¹œË¢-Íê½Õ ƒ¢C-ªÃ-’âDµ «ÕÊ-«-ªÃ©Õ, §ŒâXÔ\ ͵çjªý-X¾-ª½q¯þ ²òE§ŒÖ ’âDµ ŌʧŒÕ “XϧŒÖ¢Âà ’âDµ. ¹{ÖdÐ-¦ï{Õd, ª½ÖX¾¢.. ƒ©Ç \ §ŒÖ¢T-©ü©ð ֮͌ϯà ÆÍŒa¢ ¯ÃÊo«Õt ƒ¢C-ª½ÊÕ ¤òL …¢œä ‚„çÕ.. Æ¢Åä £¾Ý¢ŸÄ’à «u«-£¾Ç-J®¾Öh, ÅŒÊ-©Çê’ ªÃ•-Â̧ŒÕ ͌ŌÕ-ª½-ÅŒÊÕ “X¾Ÿ¿-Jz®¾Öh Æ¢Ÿ¿J ÍŒÖX¾Ü ÅŒÊ-„çjX¾Û AX¾Ûp-¹×-¯Ãoª½Õ. ƪáÅä ƒX¾p-šË-ŸÄÂà Ɯ¿-¤Ä-Ÿ¿-œ¿¤Ä “X¾Íê½ Âê½u-“¹-«Ö©ðx «Ö“ÅŒ„äÕ ¤Ä©ï_Êo “XϧŒÖ¢Â¹.. ÅÃèÇ’Ã X¾ÜJh-²Änªá ªÃ•-Â̧ŒÕ ª½¢’¹ “X¾„ä¬Á¢ Íä®Ï ꢓŸ¿¢©ð ÅŒ«Õ ¤ÄKdE ¦©ð-æXÅŒ¢ Í䧌Õ-œÄ-EÂË «Üu£¾É©Õ ®ÏŸ¿l´¢ Í䮾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã …ÅŒh-ª½-“X¾-Ÿä¬ü Ō֪½Õp “¤Ä¢ÅŒ¢-©ðE Ââ“é’®ý ¤ÄKd •Ê-ª½©ü 宓¹-{-K’à E§ŒÕ-NÕŌթãjÊ ¨ ªÃ•-Â̧ŒÕ „ê½-®¾Õ-ªÃ©Õ.. X¶Ï“¦-«J „ç៿šË „ê½¢©ð ÅŒÊ ¦ÇŸµ¿u-ÅŒ©Õ ÍäX¾-{dÊÕ¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '21 « ¬ÁÅÃ-¦lX¾Û ƒ¢C-ªÃ-’â-DµÑ’à ƢŸ¿ª½Ö «áŸ¿Õl’à XÏ©Õ-ÍŒÕ-Â¹×¯ä “XϧŒÖ¢Âà ’âDµ „ÓŸÄ ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala