ఇంత ఘోరమైన చావు నాకెందుకిస్తున్నావ్ దేవుడా.. అనిపించింది!!
కంటికి కనిపించకుండా ప్రపంచాన్నంతా కలవరపెట్టిస్తోంది కరోనా. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తేడాల్లేకుండా అందరినీ కబలిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా, అత్యాధునిక వైద్య సదుపాయాలుండే ఇటలీ, ధనిక దేశాలైన స్పెయిన్, జర్మనీ లాంటి దేశాలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఇక బ్రిటన్లోనూ కరోనా జూలు విదిల్చుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ మహమ్మారి బారిన పడ్డారంటేనే అక్కడ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ దేశ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాన్కాక్, బ్రిటన్ యువరాజు చార్లెస్లకు కూడా ఈ వైరస్ సోకింది. అయితే సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉంటే ఈ ఉపద్రవం నుంచి సులభంగా బయటపడవచ్చని ఇప్పటికే చాలామంది కొవిడ్ బాధితులు తమ స్వీయానుభవంతో నిరూపించారు. తాజాగా తాను కూడా ఈ జాబితాలో ఉన్నానంటోంది బ్రిటన్కు చెందిన తోబి అకింగ్బాడే. కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న ఈ 28 ఏళ్ల జర్నలిస్టు తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా కరోనా లక్షణాలు, ఐసోలేషన్లో పడిన బాధలు, వాటిని అధిగమించిన తీరును ట్విట్టర్ వేదికగా సవివరంగా అందరితో పంచుకుంది.
Know More