ఈ బామ్మ-తాతయ్యల ప్రేమకథ విన్నారా?
డెబ్భై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన బ్రహ్మచారి ఒకరు.. భర్త మరణంతో వితంతువుగా మారిన వారు మరొకరు.. వీరిద్దరూ తొలి చూపులోనే ‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ ప్రేమించేసుకున్నారు. మలి వయసులో మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. కట్ చేస్తే.. తన ప్రేయసి వేలికి ఉంగరం తొడిగి ప్రేమ ప్రతిపాదనను తెలియజేశాడా ఓల్డ్ లవర్. అంతే.. ఈ తాతగారి రొమాంటిక్ ప్రపోజల్‌కి ఫిదా అయిపోయిందీ బామ్మ. ఇలా వీరిద్దరి ప్రేమాయణం, లవ్ ప్రపోజల్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో లైకులు కొట్టిస్తున్నాయి. ‘బ్యూటిఫుల్ కపుల్’ అంటూ అందరితో కామెంట్లు పెట్టిస్తున్నాయి. మరి, ఈ ఓల్డేజ్ లవ్‌స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందామా!!
Know More