‘అందాల రాక్షసి’ ఫ్యాషన్లెంతో అపురూపం!
చారడేసి కళ్లు, పువ్వంటి పెదాలు, సొట్ట బుగ్గలు, ముట్టుకుంటే కందిపోయే మోము.. ఇంతటి అపురూప లావణ్యాన్ని తన సొంతం చేసుకొని టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఉత్తర్‌ప్రదేశ్ బ్యూటీ లావణ్యా త్రిపాఠి. ‘అందాల రాక్షసి’గా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మిస్టర్’, ‘అంతరిక్షం’.. వంటి సినిమాల్లో రాణించి.. తాజాగా ‘అర్జున్ సురవరం’తో మన ముందుకొచ్చింది. ఆన్‌స్క్రీన్‌పై తన అందం, అభినయంతో పాటు చక్కనైన ఫ్యాషన్లతో అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ అంతే ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతుంది. ఈ విషయం తన సోషల్ మీడియా పేజీల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో, అవార్డుల ఫంక్షన్లలో.. ఇలా అకేషన్ ఏదైనా అప్డేటెడ్ ఫ్యాషన్లతో అదరగొట్టేయడం ఈ అందాల చందమామకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే కేవలం నటిగానే కాదు.. ఈ తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా మారిపోయిందీ లవ్లీ గర్ల్. మరి, తనదైన ఫ్యాషన్లతో నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్ పాఠాలు నేర్పుతోన్న ఈ అందాల రాక్షసి వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని డిఫరెంట్ ఫ్యాషన్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..
Know More