బతుకమ్మ పాటల్లో స్త్రీ జీవనచిత్రం..!
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ అతివలంతా ఆడిపాడే పండగ రానే వచ్చింది. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి.. పాటలు పాడుతూ, పాటలకు తగ్గట్లుగా లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడవారు చేసే సందడి అంతా ఇంతా కాదు. బతుకమ్మలో పూలు, నైవేద్యాలు ఒకెత్తయితే.. బతుకమ్మ పాటల సందడి మరో ఎత్తు. వినసొంపుగా ఉండే ఈ పాటలు ఆడవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి.. ఆడవారి జీవితాల్లోని వివిధ సంఘటనలను వివరిస్తూ.. వారి జీవన చిత్రానికి అద్దం పట్టే అలాంటి కొన్ని బతుకమ్మ పాటల గురించి ‘బతుకమ్మ పండగ’ సందర్భంగా తెలుసుకుందాం..
Know More