నా కూతుళ్లకు ఆ పరిస్థితి రాకూడదనే ‘సాల్ట్’ని ప్రారంభించా!
పిరియడ్స్.. దీని గురించి నలుగురిలో మాట్లాడడానికి ఇప్పటికీ చాలామందికి సిగ్గు. ఈ క్రమంలో వారికెదురయ్యే సమస్యల్ని కనీసం సొంత వాళ్లతో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు కొందరు. ఇక, శ్యానిటరీ న్యాప్కిన్లు కొనేందుకు వెళ్తే ఎక్కడ తమను ఎగాదిగా చూస్తారోనన్న బిడియం మరికొంతమంది కాళ్లకు సంకెళ్లు వేస్తుంది. ఇలా నెలసరి విషయంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నాయనడం అతిశయోక్తి కాదు..! అయితే ఈ పద్ధతిని మార్చడానికే కొంతమంది వ్యక్తులు శక్తులుగా మారి అహర్నిశలూ ప్రయత్నిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు వెనెజులాకు చెందిన చేరీ హోగర్. ఒకానొక దశలో నెలసరి సమయంలో వాడే శ్యానిటరీ ఉత్పత్తులకు తన దేశంలో కొరత ఏర్పడడం ఆమెను ఆలోచనలో పడేసింది. వ్యక్తిగత ఉత్పత్తులు దొరక్క మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని అంచనా వేసిన ఆమె.. అలాంటి పరిస్థితి తన కూతుళ్లకు రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు ఆమె చేసిన ఆలోచనే ఈ ‘సాల్ట్’. అసలేంటీ సాల్ట్? దీనికి, నెలసరికి సంబంధమేంటి? రండి.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!
Know More