ఎంత కష్టం వచ్చిందో.. అర్థాంతరంగా తనువు చాలించేశారు..!
అందం, డబ్బు, స్టార్ స్టేటస్...ఇవన్నీ మనిషి బతకడానికి సరిపోవంటూ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(34) అకాల మరణం మరోసారి రుజువు చేసింది. వెండితెరపై ‘ధోనీ’గా మెప్పించిన ఈ యంగ్ హీరో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తద్వారా తన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు..అందరినీ శోకసంద్రంలో ముంచి స్వర్గానికి వెళ్లిపోయాడు. ఆకట్టుకునే అందం, డబ్బు, అభిమానులు, గొప్ప పేరు...ఇలా అన్నీ ఉన్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో సెలబ్రిటీల జీవితం పూలపాన్పేమీ కాదని మరోసారి నిరూపితమైంది. అయితే గతంలో సుశాంత్ మాదిరిగానే కొందరు తారలు అర్థాంతరంగా తనువు చాలించారు. అయినవాళ్లకు శోకాన్ని మిగిల్చారు. అలా చిన్న వయసులోనే మరణించిన కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి.!
Know More