భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!
స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.
Know More