సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

అప్పుడు నరకం చూపించాడు.. ఇప్పుడు మారానంటున్నాడు.. అతన్ని నమ్మనా?

మేడమ్.. మాది ప్రేమ వివాహం. ప్రేమించేటప్పుడు కూడా నేను అతనితో అన్ని విషయాల్లో సర్దుకుపోయాను. మాది పేద కుటుంబం అని తెలిసి కూడా నన్ను కట్నం అడిగాడు. అప్పుడు ‘ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకో? లేకపోతే వద్దు’ అని చెప్పాను. అయితే మా అమ్మ రూ. 1.30 లక్షల కట్నం ఇచ్చి మా పెళ్లి చేసింది. పెళ్లి అయిన 10 రోజులకే నా భర్త నరకం చూపించాడు. నన్ను కొట్టేవాడు. దాంతో నెల రోజులు మాత్రమే తనతో ఉండగలిగాను. తిరిగి మా అమ్మ వాళ్ల ఇంటికి వచ్చేశాను. పెద్ద వాళ్లు మాట్లాడి పంపిస్తే తిరిగి వెళ్లాను. రెండోసారి ఇంటికి వెళ్లాక ఒక వారం మాత్రమే ఉండగలిగాను. ఈ సారి రోడ్డు మీదనే నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు. దాంతో మళ్లీ అమ్మ వాళ్ల ఇంటికి వచ్చేశాను. అతను 5 నెలల క్రితం 'నేను మారిపోయాను. నిన్ను బాగా చూసుకుంటాను. మనం కూర్చుని మాట్లాడుకుందాం' అని మెసేజ్‌ చేశాడు. దానికి నేను ‘సరే’ అని అతడిని మా ఇంటికి రమ్మన్నాను. ఇప్పటి వరకు రాలేదు. నాకు తనతో ఉండడం అస్సలు ఇష్టం లేదు. మా మామగారు కోర్టుకి తీసుకెళ్లి ‘మేం విడిపోతాం’ అని రాసున్న స్టాంప్ పేపర్స్ మీద మాతో సంతకం చేయించారు. కానీ ఇప్పటి వరకు విడాకులు ఇవ్వలేదు. మా మామగారికి ఫోన్ చేస్తే ‘మీ వాళ్లని తీసుకుని రా’ అని అంటున్నాడు. వాళ్లేమో రామంటున్నారు. నాకు ఎవరితో చెప్పాలో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు.

Know More

Movie Masala

Video Gallery

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

మీది మొదటి నుంచి అవగాహన లోపం ఉన్నటువంటి సంబంధంలాగానే కనిపిస్తుంది
.
మీరు ప్రేమించుకున్న సమయంలోనే అతని డిమాండ్లు మీకు నచ్చలేదు
.
ఆ సమయంలోనే మీరు జాగ్రత్తగా
,
కచ్చితంగా ఆలోచించి
..
కొన్నాళ్లు వేచి చూసి
,
అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని
..
ఆపై వివాహం చేసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో
!
ఏది ఏమైనా పెళ్లి చేసేసుకున్నారు
.
ఆ సమయంలో మీ అమ్మగారు అతనికి డబ్బులివ్వడం వల్ల అతనికే ప్రయోజనం చేకూరింది
.
అయితే మీ మధ్య ఎలాంటి విషయాల్లో తగాదాలు వచ్చాయనేది స్పష్టత లేదు
.
ఒకవేళ డబ్బుల విషయంలో గొడవ అయితే
..
మీ ఇద్దరూ డబ్బుకి ఎందుకంత ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది
?
అతను మిమ్మల్ని అతిగా డిమాండ్‌ చేసేవాడా
?
లేదా అతని తల్లిదండ్రుల ఒత్తిడితో అలా చేస్తున్నాడా
?
అనేది ఆలోచించుకోండి
.
ఒకవేళ వీటిలో ఏది నిజమైనా అది న్యాయ సంబంధమైన విషయం కిందికి వస్తుంది
.
మీరు అతని వేధింపులు తట్టుకోలేక రెండుసార్లు పుట్టింటికొచ్చారు
..
మొదటిసారి పదిరోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయారు
..
రెండోసారి వారం రోజులున్నారు
.
అంటే ప్రతిసారీ మీ ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో భేదాభిప్రాయాలు వచ్చాయని మీ ఉత్తరం స్పష్టం చేస్తుంది
.
స్టాంపు పేపర్ల మీద మీ మామగారు మీతో సంతకం చేయించారని చెప్పారు
.
ఆపై మీరు ఎవరినైనా న్యాయవాదిని సంప్రదించారా అనేది రాయలేదు
.
ఐదు నెలల క్రితం మాట్లాడుకుందాం రమ్మని అన్నవాడు
..
ఆ తర్వాత మళ్లీ చొరవ చూపించకపోవడానికి కారణమేంటో పరిశీలించండి
.
మీ ఇద్దరి మధ్య అవగాహన కుదిరి జీవితాన్ని తిరిగి కొనసాగించగలరా
?
లేదా విడిపోవాలనేదే మీ చివరి అభిప్రాయమా అనే కచ్చితమైన నిర్ణయం తీసుకోండి
.
విడిపోవడమే మీ అంతిమ నిర్ణయం అయితే చట్టపరంగా ముందుకు వెళ్లడం మంచిది
.
ఒకవేళ కలిసుండాలంటే రెండు వైపుల నుంచి ఎలాంటి మార్పులు కావాలనుకుంటున్నారో
..
ఆ మార్పులు ఇద్దరికీ ఆమోదయోగ్యం అయితే
..
పెద్ద వాళ్లు
,
మధ్యవర్తులు ద్వారా సమస్యను పరిష్కరించుకోండి
.
అలాగే ఇద్దరూ కలిసి మానసిక నిపుణులను కలిసి తగిన కౌన్సిలింగ్‌ తీసుకునే ప్రయత్నం చేయండి
.
0 Likes
Know More

Movie Masala