ఇలాంటివి వింటుంటే నా రక్తం మరిగిపోతోంది!
సోనాక్షీ సిన్హా.. అలనాటి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా వారసురాలిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టినా.. తన నటనతో, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బాలీవుడ్ భామ. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు జోడీగా ‘దబాంగ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సోనాక్షి.. అనతికాలంలోనే తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఆపై ‘రౌడీ రాతోర్’, ‘దబాంగ్ 2’, ‘అకీరా’, ‘లింగా’, ‘కళంక్’.. వంటి చిత్రాలతో బాలీవుడ్ అగ్రకథానాయికలలో ఒకరిగా పేరు తెచ్చుకుందీ ముంబై భామ. ప్రస్తుతం తను నటించిన ‘దబాంగ్ - 3’ చిత్రం విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మగవారికి, ఆడవారికి మధ్య ఉన్న వేతన వ్యత్యాసం, మహిళా ప్రాధాన్య సినిమాలు, ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు.. వంటి పలు విషయాల గురించి ఎంతో ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. మరి, సోనాక్షి మనసులోని భావాలను తన మాటల్లోనే విందామా..!
Know More