సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

నన్ను అనుమానిస్తున్న నా భర్తతో అనుబంధం ఉంచుకోనా? తెంచుకోనా?

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది. మాకు రెండు సంవత్సరాల బాబున్నాడు. నా భర్త.. నాకు, నా చిన్నప్పటి స్నేహితుడితో ఇంకా సంబంధం ఉందని అంటున్నాడు. నాకు నవంబర్‌లో నెలసరి రావడం ఆలస్యమైంది. దాంతో ఆయన ‘నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు అతనితో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నావు.. ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే ఆ శుభవార్తను అతనితో చెప్పు’ అని అంటున్నాడు. దాన్ని బట్టి అతని గురించి నేనేమనుకోవాలి? మరో విషయం ఏంటంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో మా శృంగార జీవితంలో చాలా గ్యాప్‌ వచ్చింది. ఈ క్రమంలో నేను నా స్నేహితుడిని ఆనందపరుస్తున్నానేమో అని అన్నాడు. కానీ, తను నన్ను అలా అనడం నాకు నచ్చలేదు. దాంతో నేను నా భర్తను పూర్తిగా వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. మీరే నాకు సలహా ఇవ్వగలరు.

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నాతో అంత ‘వీజీ’ కాదు..!

గ్లామర్‌ రోల్స్‌తో పాటు భావోద్వేగాలతో నిండిన సున్నితమైన పాత్రల్లో సైతం ఒదిగిపోగల నటి రెజీనా కసాండ్రా. ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘జ్యో అచ్చుతానంద’, ‘అ..!’, ‘ఎవరు’.. మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ భామ. బయట జరిగే కార్యక్రమాలకు ఎక్కువగా హాజరు కాకపోయినా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం రెజీనా తన అభిమానులతో టచ్‌లో నిరంతరం ఉంటుంది. డిసెంబర్‌ 13 రెజీనా బర్త్‌ డే. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు, వాటికి ఇచ్చిన క్యాప్షన్స్‌ మీకోసం..!

Know More

women icon @teamvasundhara

మీలోని చిలిపితనాన్ని బయటకు రానివ్వండి..!

సమాజహితం కోరి చేసే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎప్పుడూ ముందుంటుంది గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా. ఈ క్రమంలో UNICEF, CROCS (ప్రముఖ షూ కంపెనీ) సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రియాంక పాల్గొంది. ఇందులో భాగంగా బెలీజ్‌ దేశానికి చెందిన స్కూల్‌ పిల్లలకు షూస్‌ పంచిపెట్టారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను ప్రియాంక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకమైంది. UNICEF, CROCS సంయుక్తంగా చేస్తోన్న ఈ కార్యక్రమంలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ క్రమంలో మేము దాదాపు 50,000 పాదరక్షలను పేద పిల్లలకు పంచిపెట్టాం. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన పేద పిల్లలకు పాదరక్షలను అందజేస్తామని ఆశిస్తున్నాం..!’ అని రాసుకొచ్చింది ప్రియాంక.

Know More

women icon @teamvasundhara

మొత్తానికి నా కలల రాణిని పెళ్లాడాను!

మొదట మిత్రులుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. తాజాగా పెద్దల ఆశీర్వాదంతో ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారే టెన్నిస్‌ స్టార్‌ సానియా సోదరి ఆనమ్‌ మీర్జా - మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌. హైదరాబాద్‌ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ క్రమంలో వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేసుకుని మురిసిపోయారీ వెడ్డింగ్‌ కపుల్‌.

Know More

women icon @teamvasundhara

నేను పర్ఫెక్ట్‌ కాదు.. ఒరిజినల్‌..!

మహేష్‌బాబు, నమ్రతల గారాల పట్టి సితార.. వయసు చిన్నదైనా, తన ట్యాలెంట్‌తో తనకంటూ స్పెషల్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుందీ సెలబ్రిటీ కిడ్‌. ఇటీవల విడుదలైన ‘ఫ్రోజెన్‌ 2’లో చిన్నారి ఎల్సాగా తన గొంతుతో అభిమానుల్ని మైమరపించింది. అంతేకాదు.. ఏ సందర్భమైనా తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుందీ చిన్నారి సెలబ్రిటీ. తాజాగా సితార క్రిస్‌మస్‌ ట్రీని తయారు చేస్తున్న ఫొటోను నమ్రత ఇన్‌స్టాలో షేర్‌ చేసి.. ‘కొందరికి క్రిస్‌మస్‌ సందడి ముందే మొదలైంది. తన బహుమతులను సకాలంలో అందుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌ మొదలైంది..’ అంటూ సీతూ పాప గురించి రాసుకొచ్చింది నమ్రత.

Know More

women icon @teamvasundhara

రంగు గురించి బాధపడేవాళ్లు నా ముఖం చూడండి..!

అందమనేది మన రంగు, రూపంలో ఉండదు..మన ఆలోచనల్లో ఉంటుంది’ అని నిరూపించింది దక్షిణాఫ్రికాకు చెందిన జోజొబిని టుంజీ. ఆకట్టుకునే అందం, శరీర సౌష్టవం లేకపోయినా ..తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో 2019 మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకుందీ 26 ఏళ్ల సుందరాంగి. బాల్యం నుంచే లింగ వివక్ష, హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ సుందరి తన ప్రతిభతో తన దేశ కీర్తి పతాకాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలో 90 మంది అందాల భామలను వెనక్కునెట్టి మరీ విశ్వసుందరిగా నిలిచిన ఈ యంగ్‌ సెన్సేషన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

నాకు కావాల్సిందల్లా.. నీతో ఉండడమే..!

తన అందచందాలతో కుర్రకారు మతి పోగొడుతోన్న హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. బుల్లితెర నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ.. సినిమాల్లోకి రాకముందు పలు సీరియళ్లలో నటించింది. 2017లో ‘చెన్నా మేరాయా’ అనే పంజాబీ చిత్రంతో పాయల్‌ సినిమా పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. ‘RX100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తార.. ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఛాలెంజింగ్‌ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం విశేషం. పాయల్‌ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తార తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకొంటుంది. డిసెంబర్‌ 5 పాయల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..!

Know More

women icon @teamvasundhara

మీరు మీలా ఉండడానికి భయపడకండి..!

కుటుంబంలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైంది. వీరిలో చాలామంది ఒకరితో ఒకరు తరచూ గొడవలు, గిల్లికజ్జాలు పెట్టుకున్నా.. ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఈ నేపథ్యంలో నివేదా థామస్‌, తన సోదరుడు నిఖిల్‌ల మధ్య ఉన్న అనుబంధం కూడా అలాంటిదే. తన తమ్ముడికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుందీ తార. ఈ క్రమంలో తనను నిఖిల్‌ ఎత్తుకొంటుండగా తీసిన ఫొటోలను నివేదా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోకు ‘ఫ్లవర్‌.. స్పైస్‌.. బోర్బాన్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చిందీ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

‘రేణు’వై వచ్చాను భువనానికి...!

నటన, దర్శకత్వం, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌, కవిత్వం.. మొదలైన సృజనాత్మక రంగాల్లో ప్రావీణ్యమున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రేణూ దేశాయ్‌. ‘బద్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తార ‘జేమ్స్‌ పాండు’, ‘జానీ’ సినిమాల్లో నటించింది. ‘ఖుషి’, ‘జానీ’, ‘గుడుంబా శంకర్‌’, ‘బాలు’, ‘అన్నవరం’.. సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది. ‘ఇష్క్‌ వాలా లవ్‌’ అనే మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా పని చేయడం విశేషం. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ తార.. ప్రస్తుతం సింగిల్‌ మదర్‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోంది. తనకు సంబంధించిన విశేషాలను రేణూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంటుంది. డిసెంబర్‌ 4 రేణూ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీ కోసం.

Know More

women icon @teamvasundhara

నువ్వు కోరుకునేదే.. నిన్ను కోరుకుంటోంది..!

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తారల్లో నటి రేణూ దేశాయ్‌ ఒకరు. తన వ్యక్తిగత విషయాలతో పాటు తన అభిప్రాయాలను, సూచనలను ఈ వేదిక ద్వారా అభిమానులతో పంచుకొంటుంటుందీ తార. ఈక్రమంలో రేణూ తాజాగా కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘మన మనసుకు నచ్చిన ఆహారాన్నే మితంగా తీసుకోవాలని నేనెప్పుడూ చెబుతుంటాను. దానితో పాటు మనం తరచూ యోగా, వర్కవుట్లు వంటివి చేస్తుండాలి. మన జీవితం చాలా చిన్నది. అందుకే మన ఆత్మను సంతృప్తి పరిచే పనులు మాత్రమే చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మద్యం, మత్తు పదార్థాలకు బానిసలుగా మారకండి. చివరి ఫొటో నేను ఆహారం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పుడు తీసింది.’ అని రాసుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

చేయి తీయమ్మా.. మీ ఫ్యాన్స్‌ అరుస్తున్నారు..!

రాశీ ఖన్నా, సాయి ధరమ్‌ తేజ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. వీళ్లిద్దరు కలిసి గతంలో ‘సుప్రీమ్’ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. అందుకే వీళ్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. నేడు రాశి పుట్టినరోజు. ఈ సందర్భంగా తేజ్‌ సోషల్‌ మీడియా ద్వారా తనకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ తాము కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో రాశి తేజ్‌ చేయిని పట్టుకొని ఉంది. తేజ్‌ ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే రాశీ ఖన్నాజీ..! ముందు చేయి తీయమ్మా.. మీ ఫ్యాన్స్‌ అరుస్తున్నారు నా మీద..! #హాత్‌నికాలో #చేయితీ’ అని సరదా క్యాప్షన్‌ను జత చేశాడు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా డిసెంబర్‌ 20న విడుదల కానుంది.

Know More

women icon @teamvasundhara

ఈ క్యూటీని చూడకుండా ఉండలేకపోతున్నా..!

సోషల్‌ మీడియా విస్తరించాక సెలబ్రిటీలను సంప్రదించడం, వాళ్లతో తమ అభిప్రాయాలు పంచుకోవడం అభిమానులకు సులభంగా మారిపోయింది. అభిమానులు తమను ట్యాగ్‌ చేసిన పోస్టులకు సెలబ్రిటీలే స్వయంగా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ‘అల..వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో.. రాములా..!’ అనే పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ క్రమంలో ఈ పాటకు ఓ చిన్నారి ముద్దుగా డ్యాన్స్‌ చేస్తుండగా తీసిన వీడియో పూజ దృష్టికి వెళ్లింది. ఈ వీడియోను తను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ‘ఎవరో ఈ వీడియోను నాకు షేర్‌ చేశారు. ఈ క్యూటీని చూడకుండా ఉండలేకపోతున్నా..! ‘రాములో.. రాములా..!’ పాట అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటోంది’ అని రాసుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

అమ్మాయి అంటే ఆ రెండు లక్షణాలుండాలి..!

‘ధడక్‌’ విజయం తర్వాత జాన్వీ తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకొంటోంది. ఈ క్రమంలో తను ప్రస్తుతం నటిస్తోన్న ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ చిత్రం డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను జాన్వీ తాజాగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంది. ‘జోయా అక్తర్‌ దర్శకత్వంలో నేను నటిస్తోన్న ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ సినిమా ఈ న్యూ ఇయర్‌ సందర్భంగా జనవరి 1 మధ్యరాత్రి 12:00 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కొత్త సంవత్సరానికి ఈ సినిమాతో ఆహ్వానం పలకండి’ అని రాసుకొచ్చింది జాన్వీ. తను ప్రస్తుతం ‘గుంజన్‌ సక్సేనా’, ‘దోస్తానా 2’ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

Know More

women icon @teamvasundhara

అడ్వాన్స్‌ పెళ్లిరోజు శుభాకాంక్షలు బేబీ..!

కుటుంబంలో అక్కా-తమ్ముళ్లు, అన్నా-చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైంది. వీళ్లలో ఎక్కువశాతం మంది బయటకి ఎప్పూడూ తిట్టుకుంటూ, గిల్లికజ్జాలు పెట్టుకుంటూ.. కనిపించినా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్‌ల మధ్య ఉండే అనుబంధమే ఉంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో తాము టామ్‌ అండ్‌ జెర్రీల్లా ఉంటామని లక్ష్మి పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్లిద్దరు కలిసి దిగిన ఓ ఫొటోను మనోజ్‌ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘టామ్‌ అండ్‌ జెర్రీలు నిశ్శబ్దంగా ఒకే వైపు చూస్తుంటే ఇలాగే ఉంటుంది. నా లవ్లీ అక్క..!’ అని రాసుకొచ్చాడు.

Know More

women icon @teamvasundhara

నాకు ప్రేమంటే ఏంటో తెలిసిందంటే.. అది మీ వల్లే..!

చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 16 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా స్టార్‌ హీరోయిన్‌గా అభిమానుల చేత నీరాజనాలు అందుకొంటోన్న నటి నయనతార. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమకు వచ్చి సూపర్‌ స్టార్‌గా ఎదిగిన తారల్లో నయన్‌ కూడా ఒకరు. 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాక ముందు నయనతార ఓ మలయాళ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసేది. తను యాంకర్‌గా వ్యవహరించిన అప్పటి కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో నయన్‌ను గుర్తుపట్టడం చాలా కష్టమే..! 13 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నయన్‌ తన పేరు డయానా అని చెప్పడం గమనార్హం. అవును.. ఈ తళుకు తార అసలు పేరు డయానా మరియం కురియన్‌. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘టీవీ యాంకర్‌గా పని చేసే స్థాయి నుంచి లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నయన్‌ జీవితం ఎందరికో ఆదర్శం’ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon @teamvasundhara

సామజవరగమన... నిను చూసి ఆగగలమా..!

తన అందం, అభినయంతో ఇటు టాలీవుడ్‌తో పాటు.. అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న తార పూజా హెగ్డే. సినిమాల్లోకి రాక ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2010లో జరిగిన ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాలతో పూజ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తను నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్‌’.. తదితర చిత్రాలు పూజను తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయి. పూజ వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు తరచూ టచ్‌లోనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. తన లేటెస్ట్‌ సినిమా అప్‌డేట్స్‌, ఫొటోషూట్స్‌, వర్కవుట్‌ వీడియోలు.. మొదలైన విశేషాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుందీ అమ్మడు. ఈ క్రమంలో పూజ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు, వాటికి తను జత చేసిన క్యాప్షన్స్‌ మీకోసం..!

Know More

women icon @teamvasundhara

ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు..!

మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారల్లో నమ్రతా శిరోద్కర్‌ ఒకరు. సినిమాల్లోకి రాకముందు పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఈ తార.. 1993లో మిస్‌ ఇండియా టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మహేష్‌తో వివాహం తర్వాత నమ్రత సినిమాలకు గుడ్‌బై చెప్పి కుటుంబ బాధ్యతలకే అంకితమైంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో తను మోడల్‌గా ఉన్న రోజుల్లో ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా తీసిన కొన్ని ఫొటోలను నమ్రత తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘వేదికే నీ ప్రపంచం అయినప్పుడు..! స్నేహితులతో ఉన్న ఆ రోజులు ఎంతో బాగుండేవి..!’ అని రాసుకొచ్చింది నమ్రత.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది. మాకు రెండు సంవత్సరాల బాబున్నాడు. నా భర్త.. నాకు, నా చిన్నప్పటి స్నేహితుడితో ఇంకా సంబంధం ఉందని అంటున్నాడు. నాకు నవంబర్‌లో నెలసరి రావడం ఆలస్యమైంది. దాంతో ఆయన ‘నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు అతనితో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నావు.. ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే ఆ శుభవార్తను అతనితో చెప్పు’ అని అంటున్నాడు. దాన్ని బట్టి అతని గురించి నేనేమనుకోవాలి? మరో విషయం ఏంటంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో మా శృంగార జీవితంలో చాలా గ్యాప్‌ వచ్చింది. ఈ క్రమంలో నేను నా స్నేహితుడిని ఆనందపరుస్తున్నానేమో అని అన్నాడు. కానీ, తను నన్ను అలా అనడం నాకు నచ్చలేదు. దాంతో నేను నా భర్తను పూర్తిగా వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. మీరే నాకు సలహా ఇవ్వగలరు.

మీ ఉత్తరం చివరి వాక్యంలో మీ సమస్య గురించి మీరు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా రాశారు
.
ఒకవేళ మీరు నిర్ణయం తీసేసుకుంటే ‘ఏం చేయమంటారు’ అని మరొకరిని అడగడం ఏమాత్రం
అవసర
మో ఆలోచించుకోండి
.
ఆ విషయం కాసేపు పక్కకు పెడితే
,
మీ చిన్ననాటి స్నేహితుడు మీ జీవితంలోకి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రవేశించడం
,
అతను మీ పట్ల ఇష్టా్న్ని వ్యక్తం చేయడం
,
మీకూ ఇష్టం ఉందనే ఉద్దేశంతో అంగీకరించడం
..
ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడం
..
తిరిగి స్నేహాన్ని కొనసాగించడం
..
ఇవన్నీ గమనిస్తే మీ స్నేహం ఎత్తుపల్లాలతో కూడినదిగా కనిపిస్తోంది
.
చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో
..
దానిని మీరు ప్రేమగా నిర్వచించుకున్నారా
?
ఒకవేళ చిన్ననాటి స్నేహితుడు కాకుండా స్నేహితురాలు కలిసుంటే మీకు ఇలాంటి భావనే ఉండేదా
?
అనేది మీరు ఆలోచించుకోండి
.
అసలు మీ ఇద్దరి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉందా
?
లేక మీ మధ్య ఉన్న స్నేహాన్ని మరో విధంగా చెప్పుకుంటున్నారా
?
అనే విషయాన్ని కూడా మీరే ధృవీకరించుకోండి
.

మీరు మీ తల్లిదండ్రుల మాటకు విలువిచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత మీ కాపురం సంతోషంగా ఉండదని అతను జోస్యం చెప్పడం
,
నిజంగానే అతను చెప్పినట్లు జరుగుతుందని మీరు అనుకోవడం అనేవి ఎంత వరకు సాధ్యమో ఆలోచించుకోండి
.
ఒకవేళ నిజంగా మీ పట్ల ప్రేమ
,
గౌరవం ఉన్న వ్యక్తి అయితే మీ జీవితం సంతోషంగా ఉండదని జోస్యం ఎందుకు చెప్తాడు
?
మీ ఇద్దరి మధ్య అంత ఇష్టం ఉంటే
..
కేవలం ఫోన్‌లో కాకుండా బయటకు వచ్చి మీ తల్లిదండ్రులతో ఎందుకు చెప్పలేదు
?
ఫోన్లలో మాట్లాడుకున్నంత మాత్రాన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా
?
అనేవి మీకు మీరే తరచి చూసుకోవాల్సిన విషయాలు
.
అలాగే మీ ఇద్దరూ కలిసి మీ తల్లిదండ్రులను ప్రత్యక్షంగా సంప్రదించారా
?
వారి ఇష్టాయిష్టాలను కనుక్కున్నారా
?
ఒక్కసారి వెనక్కి వెళ్లి మీ జీవితంలో జరిగిన ఈ విషయాల గురించి ఆలోచించి చూడండి
.

intercoursegapgh650-1.jpg

మీకు రెండు సంవత్సరాల బాబు ఉన్నాడని రాశారు
.
మీపై ఇన్ని రోజులు రాని అనుమానం మీ భర్తకు ఇప్పుడే ఎందుకు కలిగింది
?
మీ భర్త మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని కేవలం స్నేహం మాత్రమే అని అనుకునే పరిస్థితులున్నాయా
?
అసలు అతనికి మీపై వేరే రకమైన అనుమానం రావడానికి కారణం ఏమిటి
?
ఒకవేళ అతను మిమ్మల్ని నిరాధారంగా శంకిస్తున్నాడనుకుంటే
..
దానిని పోగొట్టడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు
?
అనేవి పరిశీలించుకోండి
.
అలాగే అతను మిమ్మల్ని మానసికంగా బాధిస్తున్నాడనుకున్నప్పుడు
,
ఆ విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పారా
?
నిజంగా మీ చిన్ననాటి స్నేహితునితో ఇంకా సంభాషణ కొనసాగుతుందా
?
లేక పాత స్నేహాన్ని పునాదిగా తీసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడా
?
అనేది ఆలోచించుకోండి
.

ఈ క్రమంలో ఒకవేళ మీపై నిరాధారమైన ఆరోపణలు ఉన్నప్పుడు వాటిని నిరూపించడానికి ఏం చేయాలి
?
ఎలాంటి ప్రయత్నాలు చేయాలి
?
అనేవి మీకు మీరే ప్రశ్నించుకోండి
.
మీ భర్తతో ఉన్న అనుబంధాన్ని ఇంకా కొనసాగించుకోవాలనుకుంటే
..
ఇద్దరూ కౌన్సిలింగ్‌కి వెళ్లండి
.
రెండు వైపుల నుంచి బంధాన్ని ఎలా దృఢపరచుకోవాలో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి
.
ఒకవేళ మీరు రాసిన ఉత్తరంలో చివర్లో చెప్పినట్టుగా మీరు మీ నిర్ణయం ఇప్పటికే తీసేసుకుంటే
..
తదనంతర పరిణామాల గురించి మీ కుటుంబ సభ్యులు
,
మీకు సహాయం చేయగలిగిన వారితో మాట్లాడండి
.
0 Likes
Know More

Movie Masala