అమ్మే నా రియల్ హీరో.. ఎప్పటికీ నేను శ్యామల కూతురినే!
ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాలంటే ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తుంది. అందుకు తగ్గట్టే ఈసారి కూడా అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించాయి. పోలింగ్ మొదలుకుని మొన్నటి క్యాపిటల్ భవనంపై దాడి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా రాజకీయాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు కారణం ‘కమలాదేవి హ్యారిస్’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ మూలాలున్న ఆమె అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలయ్యారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా.. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలిగా అగ్రరాజ్య రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న ఈ సూపర్ వుమన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...
Know More