సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

అందుకే ఆ రోజు నాకు బాగా గుర్తుంది!

అటు నటనలోనే కాకుండా సింగర్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్న అందాల భామ శృతి హాసన్‌. చిన్నప్పటి నుంచి సంగీతంపై తనకున్న ఆసక్తే తనను గొప్ప గాయనిగా మనందరికీ పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు పాడిన ఈ చిన్నది.. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ని కూడా రూపొందిస్తుంటుంది. ఇలా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో అనునిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ.. తన సినిమా అప్‌డేట్లతో పాటు తాను పాల్గొనే లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ విశేషాలను కూడా షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో శృతి తన చిన్ననాటి ఫొటో ఒకటి తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. ఇందులో భాగంగా స్కూల్‌ యూనిఫాం ధరించిన శృతి.. ప్రముఖ గాయని ఆశా భోంస్లే ముందు కూర్చొని పాట పాడుతున్న ఫొటోను ఎవరో షేర్‌ చేయగా.. దాన్ని తిరిగి రీపోస్ట్‌ చేస్తూ.. ‘నేను స్కూల్‌ యూనిఫాంలో పాట పాడుతున్న ఈ ఫొటో అంటే నాకెంతో ఇష్టం.. ఓ దిగ్గజ గాయని (ఆశా భోస్లే) సమక్షంలో ఎంతో నెర్వస్‌గా పాట పాడిన ఈ రోజు నాకు బాగా గుర్తుంది. అదొక మధుర జ్ఞాపకం. ఈ ఫొటోని షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు..’ అంటూ పేర్కొందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

గ్లోబల్‌ స్టారా.. మజాకానా?

ఇటు బాలీవుడ్‌లోనూ, అటు హాలీవుడ్‌లోనూ నటిస్తూ గ్లోబల్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్న లవ్లీ బ్యూటీ ప్రియాంక చోప్రా. యువతలో ఈ ముద్దుగుమ్మకున్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఇక సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుందీ స్టార్‌ హీరోయిన్‌. తాజాగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 50 మిలియన్లకు చేరుకుంది. అంతేకాదు.. భారతీయ సెలబ్రిటీల్లో ఇంతమంది సోషల్‌ మీడియా ఫాలోవర్లు విరాట్‌ కోహ్లీ తర్వాత మన పీసీకే ఉండడం విశేషం. 50.3 మిలియన్ల ఫాలోవర్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా, ప్రియాంక.. 50 మిలియన్‌ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచింది. మరి గ్లోబల్‌ స్టారా మజాకానా! వీరిద్దరి తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెను 44.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Know More

women icon @teamvasundhara

మీకు వినోదాన్ని పంచడానికి వచ్చేస్తున్నా..!

సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటున్న పాపులర్‌ మొబైల్‌ యాప్‌లలో, ‘టిక్‌టాక్‌’ ముందు వరుసలో ఉంటుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. రోజురోజుకీ ఈ మొబైల్‌ యాప్‌లో ఎంతోమంది కొత్త యూజర్లు చేరుతుండగా, ఇందులో సెలబ్రిటీలు కూడా చాలామందే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే మన టాలీవుడ్‌ బ్యూటీ అదా శర్మ టిక్‌టాక్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో తాను కూడా చేరినట్లు ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది అందాల తార మంచు లక్ష్మీ ప్రసన్న. ‘మీకు వినోదాన్ని పంచడానికి నేను 12 మంది అద్భుతమైన క్రియేటర్లతో వస్తున్నాను.. మీరు నన్ను ఫాలో కావాలంటే టిక్‌టాక్‌లో @lakshmimanchu అనే ఐడీని ఫాలో అవ్వండి..!’ అంటూ రాసుకొచ్చిందీ మంచువారి వారసురాలు.

Know More

women icon @teamvasundhara

వీళ్లు నా జీవితంలో ఉండడం నా అదృష్టం..!

‘పద్మావత్‌’ బ్యూటీ దీపికా పదుకొణె జనవరి 5న తన 34వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా అభిమానుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తాయి. అయితే తన భార్యపై తనకున్న ప్రేమను ఎప్పుడూ వినూత్న రీతిలో చాటుకునేందుకు ప్రయత్నించే రణ్‌వీర్‌ సింగ్‌.. దీపిక పుట్టినరోజు సందర్భంగా తనకు ఏ విధంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తాడోనని దీపిక అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలో తన లేడీ లవ్‌కు సోషల్‌ మీడియా ద్వారా ఎంతో క్యూట్‌గా విషెస్‌ తెలియజేశాడీ గల్లీబాయ్‌. దీపిక చిన్ననాటి ఫొటోను రణ్‌వీర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘నా లిటిల్‌ మార్ష్‌మెల్లోకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!’ అంటూ ప్రేమగా రాసుకొచ్చాడు. ఈ ఫొటోలో, దీపిక చిట్టి గౌన్‌ ధరించి ఎంతో క్యూట్‌గా ఉంది.

Know More

women icon @teamvasundhara

ఆ అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా..!

నితిన్‌, రష్మిక మందన జంటగా ‘భీష్మ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ ఇటలీలోని పొజిటానో అనే నగరంలో జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్‌ విరామ సమయంలో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్‌ రోషన్‌ చిత్రం ‘వార్‌’లోని ‘గుంగ్రూ’ అనే పాటకు నితిన్‌, రష్మిక కాలు కదిపారు. ఈ పాటలో పాపులర్‌ అయిన లెగ్‌ స్టెప్‌ను అనుకరిస్తూ వీళ్లిద్దరూ చేసిన డ్యాన్స్‌ వీడియోను రష్మిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘హృతిక్‌ సర్‌... ఈ వీడియో ద్వారా మా ప్రేమను మీకు అందిస్తున్నాం..!’ అని హృతిక్‌ను ట్యాగ్‌ చేసింది. ఇక హృతిక్‌ తాజాగా ఈ ట్వీట్‌పై స్పందించడం విశేషం. ‘స్వీట్‌..! థ్యాంక్యూ సో మచ్‌ రష్మిక, నితిన్‌. భీష్మ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా..! లవ్‌ యూ గాయ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశాడీ హ్యాండ్సమ్‌ హంక్‌.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala