లాక్డౌన్లో మన మిల్కీ బ్యూటీ ఏం చేస్తోందో చూశారా?
మిల్కీ బ్యూటీ.. ఈ పేరు వినగానే మన కళ్ల ముందు కదలాడే పాలరాతి శిల్పం తమన్నా కాక ఇంకెవరు..! తన అందం, అభినయంతో టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది తమ్మూ. పాత్రల ఎంపికలో పర్ఫెక్ట్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఫిట్నెస్ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గదు. అందుకే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైనా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోందీ మిల్కీ బేబ్. అంతేకాదు.. తన ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్, చేసే వ్యాయామాలు, పాత జ్ఞాపకాలు.. ఇలా బోలెడన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తమన్నా పంచుకున్న క్వారంటైన్ డైరీస్లోని కొన్ని అంశాలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..
Know More