సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అవసరమైతే ఎన్నిసార్లయినా ప్లాస్మాను దానం చేస్తా!

సాధారణంగా పోలీసులంటే సమాజంలో ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది. కర్కశంగా కనిపించే వీరికి కరుణ, దయ, జాలి లాంటివేవీ ఉండవని చాలామంది అనుకుంటుంటారు. అయితే కఠినమైన ఖాకీ దుస్తుల చాటున కరిగిపోయే మనసు కూడా ఉంటుందని నిరూపించింది హైదరాబాద్‌కు చెందిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. వృత్తి నిర్వహణలో భాగంగా కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె తాజాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో కరోనా బాధితుడికి ప్లాస్మాను దానం చేసింది. తన మంచి మనసుతో మరొకరి ప్రాణాలు నిలబెట్టిన ఈ సూపర్ పోలీస్‌ ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటోంది. ‘పోలీసుగా ప్రజల ప్రాణాలను కాపాడడమే నా ప్రథమ కర్తవ్యం. నా కారణంగా ఒకరి ప్రాణం నిలబడుతుందంటే ఎన్నిసార్లయినా ప్లాస్మాను దానం చేయడానికి రడీ’ అంటోన్న ఆ మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్ మనోగతమేంటో మనమూ విందాం రండి...

Know More

women icon @teamvasundhara

ŠÂ¹ˆêªh ¹¯Ãu-ŸÄÊ¢ Íä®Ï¢C!

¦µÇª½-ÅŒ-Ÿä¬Á¢ NGµÊo ‚Íê½ «u«-£¾É-ªÃ-©Â¹× X¾ÛšËd-E©Õx.. ƒ„ä «ÕÊLo ƒÅŒ-ª½Õ-©Åî ¤òLaÅä, “X¾Åäu-¹¢’à E©Õ-X¾Û-Åêá. ƪáÅä ‚Íê½ «u«-£¾É-ªÃ©ðx ‡Â¹ˆœÄ \«Ö“ÅŒ¢ ªÃ°-X¾-œ¿E ŌŌy¢ ÂíEo²Äª½Õx ÂíEo ƒ¦s¢-Ÿ¿Õ-©Â¹Ø ’¹ÕJ-Íä-®¾Õh¢C. Æ©Ç¢šË „ÚË-©ðx¯ä ŠÂ¹šË åXRx©ðx ÅŒ¢“œä ¹ØÅŒÕJ ¹¯Ãu-ŸÄÊ¢ Í䧌Ö-©Êo X¾Ÿ¿l´A. ²ÄŸµÄ-ª½-º¢’à Ưä¹ ¦µÇª½-B§ŒÕ åXRx-@Áx©ð «Ÿµ¿Õ«ÛÊÕ Â¹¯Ãu-ŸÄÊ¢ Íäæ® X¾Ÿ¿l´A ¹E-XÏ-®¾Õh¢C. «Ÿµ¿Õ«Û ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ‚„çÕÊÕ «ª½ÕœË ÍäAÂË ÆX¾p-T-²Ähª½Õ. ƒ¢Ÿ¿Õ©ð ÅŒ¢“œä “X¾ŸµÄÊ¢. ŠÂ¹-„ä@Á Æ«Öt-ªáÂË ÅŒ¢“œË ©ä¹-¤òÅä ÅŒLx ŠÂ¹ˆêªh ‚ X¾Ÿ¿l´-ÅŒÕ-©Fo ¤ÄšË¢-Íä¢-Ÿ¿ÕÂ¹× Æª½Õ|-ªÃ©Õ Âß¿Õ.. ‚„çÕ ‹ X¾Â¹ˆÊ …¢œË-¤òÅä.. ¦µÇªÃu-¦µ¼-ª½h-©ãjÊ «Õªî •¢{ ¹¯Ãu-ŸÄÊ¢ Í䧌ÖL.. ƒD ÍéÇ-«Õ¢C ¤ÄšË¢Íä ‚Íê½¢. ÂÃF XÏ©xLo *Êo-Ōʢ ÊÕ¢* ¹†¾d-X¾œË åX¢*Ê ÅŒLx.. ÅŒÊ Â¹ØÅŒÕ-JE «ª½ÕœË ÍäA©ð åX{d-œÄ-EÂË «Ö“ÅŒ¢ X¾E-ÂË-ªÃŸÄ? ÆE ¦µÇN¢-Íä-„ê½Õ ‡¢Åî-«Õ¢C.. Æ©Ç¢šË «uêÂh ¨ ÅŒLx ¹؜Ä.. Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ.. ‚ÍÃ-ªÃ-©ÊÕ Âî¾h «ÖJa ÅŒÊ Â¹ØÅŒÕJ ¹¯Ãu-ŸÄÊ¢ ÅŒ¯ä Eª½y-£ÏÇ¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ ÅŒMx-¹Ø-ÅŒÕ@Áx ¤¶ñšð©Õ ¯çšü©ð „çjª½-©ü’à «Öª½Õ-ÅŒÕ-¯Ãoªá..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala