నన్ను ఇంత బాగా ప్రేమించే పిల్లలు ఉండడం నా అదృష్టం!
ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన గాత్రంతో తెలుగు సినీ సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది గాయని సునీత. కొద్ది రోజుల క్రితం మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనితో కలిసి ఏడడుగులు నడిచిన ఈ బ్యూటిఫుల్ సింగర్.. తన వైవాహిక జీవితంలోని మధురమైన క్షణాల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీత, రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నారు.
Know More