‘బంగారు కోడిపెట్ట’ పాటకు వీళ్ల డ్యాన్స్ చూశారా..?
జీవితమంటే సంపాదన, బాధ్యతలు మాత్రమే కాదు.. సరదాలు, సంతోషాలు కూడా ఉండాలి. అప్పుడే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది. ఈ సూత్రాన్నే ఫాలో అవుతున్నారు మన 1980ల నాటి తారలు. దక్షిణ పరిశ్రమకు సంబంధించి 80 దశకానికి చెందిన నటీనటులంతా ప్రతి ఏడాదీ ఒకచోట చేరి సందడి చేస్తుంటారు. ఈ టీమ్‌కి ‘క్లాస్ ఆఫ్ 80's’ అనే పేరు కూడా ఉంది. అయితే ఈ ఏడాది ఈ పార్టీ కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన సంగతి తెలిసిందే. కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన అలనాటి తారలు పాల్గొని సందడి చేశారు. కాసేపు తమ టెన్షన్లన్నీ మర్చిపోయి ఆటలు, పాటలు, విందులు, వినోదాలతో నటీనటులంతా హాయిగా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి..? అందులో ఉన్నది ఎవరు..? ఈ విషయాలు తెలియాలంటే వీడియోపై ఓ లుక్కేయాల్సిందే..!
Know More