భర్తంటే ఇష్టం లేదు.. ప్రేమికుడేమో రమ్మంటున్నాడు.. ఏం చేయాలి?
నమస్తే మేడమ్.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనికి చదువు, సంస్కారం, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. అతనికి కూడా నేనంటే అంతే ఇష్టం. అన్ని విషయాల్లో మేము దగ్గరయ్యాం. మా ఇంట్లో నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, బంధువులందరూ నన్ను తిట్టడంతో ఇష్టం లేకున్నా నా మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. మా పెళ్లై నెల రోజులవుతోంది. అయితే మా ప్రేమ విషయాన్ని గత రెండు సంవత్సరాలుగా మా బావకు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఆఫీసు పని మీద నా భర్తకు దూరంగా వేరే ఊరిలో ఉంటున్నా. అతనంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగుంది. కేవలం నా పెళ్లి గురించే అమ్మ అలా చేసిందని తెలిసింది. మరోపక్క నేను ప్రేమించిన అబ్బాయి ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, రమ్మని అంటున్నాడు. అతని ఇంట్లో వాళ్లు కూడా నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు.
Know More