ఇవి వాడితే బరువు కూడా తగ్గుతుందట!
నీటిని శుద్ధి చేసుకోవడానికి వివిధ రకాల వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు పుట్టుకొస్తున్నాయి.. కానీ పూర్వకాలంలో ఇలాంటివన్నీ ఎక్కడివి? పైగా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నట్లు ఆ కాలానికి చెందిన వారే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు కూడా! మరి ఎందుకలా? వారి ఆరోగ్య రహస్యమేంటి.. అంటారా? ఇంకేముంది 'రాగి' పాత్రలే! నీటిని నిల్వ చేసుకోవడానికైనా, ఆహారాన్ని వండుకోవడానికైనా, వండిన ఆహారం తినడానికైనా.. ఇలా ప్రతి దానికీ వారు రాగి పాత్రలనే ఉపయోగించేవారు. అందులోని సకల పోషకాలు తీసుకునే ఆహారంలో చేరి.. అవి శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడేవి. అయితే ఆ రాగి పాత్రలు ఇప్పుడు కాస్త రూపురేఖల్ని మార్చుకొని మళ్లీ మన ముందుకొచ్చేశాయి. అంతేకాదు.. వాటిని ఉపయోగించే వారూ నానాటికీ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం, రాగి పాత్రల్లో ఆహారం తినడం.. వంటి వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.
Know More