నేను ఆ మానసిక రుగ్మతతో బాధపడుతున్నా!
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినా.. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది దియామీర్జా. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార 2000లో ‘మిస్ ఏషియా పసిఫిక్’ కిరీటం కూడా దక్కించుకుంది. ఆ తర్వాత ‘రెహ్నా హై తేరే దిల్ మే’, ‘తుమ్సా నహీ దేఖా’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘క్రేజీ 4’, ‘లవ్ బ్రేకప్స్ జిందగీ’ ‘సంజు’ లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక గతేడాది తన భర్తతో విడాకులు తీసుకున్న ఈ అందాల తార ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ టీవీ షోకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
Know More