కంటి అలసటను తగ్గించేసుకుందామిలా!
కరోనా రాకతో ప్రపంచమంతా టెక్నాలజీ మయం అయిపోయింది. ఇప్పటికే పెద్దవాళ్లు ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని తమ వర్కింగ్ లైఫ్‌స్టైల్‌గా మార్చుకుంటే, విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్‌కు అలవాటు పడుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ నిరంతరాయంగా టెక్నాలజీ మోజులో పడిపోయి కంప్యూటర్/మొబైల్‌కు కళ్లప్పగించేస్తే కంటి ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. చాలామందిలో ఇది కంటి అలసటకు, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడానికి కారణమవుతుంది. అయితే మరి, ఈ సమస్యను పరిష్కరించుకోవడమెలా.. అంటారా? అందుకోసమే ఓ చక్కటి టిప్‌తో మన ముందుకొచ్చేసింది బాలీవుడ్ అందాల తార రవీనా టాండన్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ అందాల అమ్మ.. వివిధ రకాల బ్యూటీ టిప్స్‌ని, ఆరోగ్య చిట్కాల్ని, తాను చేసే వంటకాల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కంటి అలసటను తగ్గించుకునే అద్భుతమైన చిట్కాను మన ముందుకు తీసుకొచ్చిందీ యమ్మీ మమ్మీ.
Know More