ఇంట్లోనే ఉల్లి సాగు చేద్దాం..!
‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అని ఓ సామెత ఉంది. నిజమే పొట్టనిండా పోషకాలు నింపుకున్న ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. గుండె జబ్బుల నివారణకు, రక్త ప్రసరణ మెరుగుపడడానికి, కేశ సంపదకు.. ఇలా అటు ఆరోగ్యపరంగా, ఇటు అందానికీ ఉల్లి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏ వంటకమైనా సరే రుచిగా రావాలంటే అందులో ఉల్లిపాయల్ని వేయాల్సిందే! అయితే వీటికోసం మార్కెట్లకు పరుగులు పెట్టే వారు కొందరైతే.. ఇంట్లోనే సాగు చేసుకునే వారు మరికొందరు. ఇలా ఇంట్లోనే ఉల్లిపాయల్ని పెంచుకోవడం వల్ల ఉల్లిధరలు ఆకాశాన్నంటినప్పుడు కూడా ఎలాంటి కొరతా లేకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఉల్లి సాగా.. కాస్త కష్టంగా ఉంటుందేమో.. అనుకుంటే పొరపాటే! ఎందుకంటే కాస్త ఓపిక, శ్రద్ధ పెడితే ఇంటి వరండాలోనే ఎంచక్కా ఉల్లిపాయల్ని సాగు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
Know More