సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వారి కోసం రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తోంది!

ఆమె ఒక సాదాసీదా అంగన్‌వాడీ కార్యకర్త. గర్భిణులు, కొత్తగా తల్లైన మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారం అందించడం ఆమె విధి. ఇలా తన రోజువారీ విధులు నిర్వర్తిస్తోన్న క్రమంలోనే అనుకోకుండా ఈ కరోనా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. దాంతో అటు గర్భిణులు, ఇటు బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడానికి భయపడిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తన పనులేవో తాను పూర్తి చేసుకొని, ఇతర విషయాలను పట్టించుకోకపోయినా ఆమెను ఎవరూ ఏమీ అనరు.. పైగా ప్రభుత్వం నుంచి అందాల్సిన జీతం కూడా సరైన సమయానికి అందుతుంది. కానీ ఇవేమీ ఆలోచించలేదామె. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి రాకపోతేనేం.. నేనే వాళ్ల దగ్గరికి వెళ్తానని నిశ్చయించుకుంది. అలా దాదాపు ఏడు నెలలుగా ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తూ గర్భిణులకు, బాలింతలకు కావాల్సిన పోషకాహారం అందిస్తోందామె. అది కూడా రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తూ మరీ! ఇలా పని పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతోంది కాబట్టే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, ఇంతకీ ఎవరామె? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

హాస్టల్ ఫుడ్ తిని బాగా లావయ్యా.. అప్పుడలా సన్నబడ్డా!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అవును మరి.. మనం ఏ పనిచేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని సమర్థంగా పూర్తిచేయగలుగుతాం. అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో పోషకాహారం, ఆరోగ్యం గురించి అందరిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్‌ 1-7 వరకు ‘జాతీయ పోషకాహార వారం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ పోషకాహారం గురించి అందరిలో అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుందీ బ్యూటీ. ఒకప్పుడు లావుగా ఉన్న తాను చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్లే లావు తగ్గానని, అప్పట్నుంచి చక్కటి ఆహారపుటలవాట్లను అలాగే కొనసాగిస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన ఆహారపుటలవాట్లు, ఆరోగ్య రహస్యాల గురించి ‘ఆస్క్‌ మీ సెషన్‌’ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిందీ హరియాణా అందం. మరి, ఈ చక్కనమ్మ పంచుకున్న ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా?!

Know More

women icon @teamvasundhara

చలికాలంలో ఆరోగ్యం జాగ్రత్త!

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వేడివేడిగా ఆహారం తీసుకోవాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. అయితే వేడివేడి ఆహారం లాగించాలనుకోవడం మంచిదే.. కానీ అది ఇంట్లో కాకుండా బయటి పదార్థాలకు, ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు. పైగా ఈ కాలంలో చలికి ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్, లంచ్.. ఇలా అన్నీ ఆలస్యంగానే జరుగుతుంటాయి. వీటికి తోడు 'అసలే బయట చలిగా ఉంటే ఇక వ్యాయామం ఏం చేస్తాంలే..' అంటూ చాలామంది ఎక్సర్‌సైజ్‌ను వాయిదా వేస్తుంటారు. చలికాలంలో ఎదురయ్యే ఇలాంటి పరిణామాల వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే శీతాకాలంలోనూ సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమంటున్నారు. మరి, ఈ కాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ÍŒL-ÂÃ-©¢©ð ‚ªî’¹u¢ èÇ“’¹ÅŒh!

QÅÃ-ÂÃ-©¢©ð …³òg-“’¹-ÅŒ©Õ ªîV-ªî-VÂÌ ÅŒ’¹Õ_-«áÈ¢ X¾œ¿Õ-ÅŒÕÊo ÂíDl „äœË-„ä-œË’à ‚£¾Éª½¢ B®¾Õ-Âî-„Ã-©Êo ÂîJ¹ åXª½Õ-’¹ÕÅŒÖ …¢{Õ¢C. ƪáÅä „äœË-„äœË ‚£¾Éª½¢ ©ÇT¢-ÍÃ-©-ÊÕ-Âî-«œ¿¢ «Õ¢*Ÿä.. ÂÃF ÆC ƒ¢šðx ÂùעœÄ ¦§ŒÕšË X¾ŸÄ-ªÃn-©Â¹×, «áÈu¢’à •¢Âú-X¶¾Ûœþ B®¾Õ-¹ע˜ä «Ö“ÅŒ¢ ƯÃ-ªî’¹u¢ ¦ÇJÊ X¾œ¿Â¹ ÅŒX¾pŸ¿Õ. åXj’à ¨ Â颩ð ÍŒLÂË ‚©-®¾u¢’à E“Ÿ¿ ©ä«œ¿¢ «©x “¦äÂú-¤¶Ä®ýd, ©¢Íý.. ƒ©Ç ÆFo ‚©-®¾u¢-’Ã¯ä •ª½Õ-’¹Õ-Ōբ-šÇªá. OšËÂË Åîœ¿Õ 'Æ®¾©ä ¦§ŒÕ{ ÍŒL’à …¢˜ä ƒÂ¹ „Ãu§ŒÖ«Õ¢ \¢ Íä²Äh¢©ä..Ñ Æ¢{Ö ÍéÇ-«Õ¢C ‡Â¹q-ªý-å®j-èüÊÕ „êáŸÄ „䮾Õh¢-šÇª½Õ. ÍŒL-ÂÃ-©¢©ð ‡Ÿ¿Õ-ª½§äÕu ƒ©Ç¢šË X¾J-ºÇ-«Ö© «©x X¾©Õ ƯÃ-ªî’¹u ®¾«Õ®¾u© ¦ÇJÊ X¾œ¿Â¹ ÅŒX¾pŸ¿¢{Õ-¯Ãoª½Õ ‚ªî’¹u EX¾Û-ºÕ©Õ. Æ¢Ÿ¿Õê QÅÃ-ÂÃ-©¢-©ðÊÖ ®¾éªjÊ ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ B®¾Õ-Âî-«œ¿¢ ‡¢Åî Æ«-®¾-ª½-«Õ¢-{Õ-¯Ãoª½Õ. «ÕJ, ¨ Â颩𠂪î-’ÃuEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-„Ã-©¢˜ä ‡©Ç¢šË ‚£¾Éª½¢ B®¾Õ-Âî-„éð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

®¾ÖX¾-ªý-X¶¾Ûœþ.. ‚ªî-’ÃuEé¢Åî ’¹Õœþ!

'®¾ÖX¾ªý «Öu¯þÑ ’¹ÕJ¢* «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. «ÕJ, ®¾ÖX¾-ªý-X¶¾Ûœþ Æ¢˜ä \¢šð OÕÂ¹× Åç©Õ²Ä..? ƒ¢Ÿ¿Õ©ð «ÕÊ ¬ÁK-ªÃ-EÂË ÂÄÃ-LqÊ ÆEo ¤ò†¾-ÂÃ©Ö EÂË~-X¾h„çÕi …¢šÇªá. „ÚËE “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ B®¾Õ-¹ע-˜ä¯ä ¬ÁKª½ °«-“ÂË-§ŒÕ©Õ ®¾“¹-«Õ¢’à X¾E-Íäæ® O©Õ¢-{Õ¢C. Æ¢Åä-Âß¿Õ.. ¤ò†¾-ÂÃ-©Fo E¢œËÊ ƒ©Ç¢šË ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn© «©x ‡©Ç¢šË ƯÃ-ªî’¹u¢ Ÿ¿J-Íä-ª½-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿ÍŒÕa. Æ¢Ÿ¿Õê °N-ÅŒ¢-©ðE \ Ÿ¿¬Á-©ð-¯çj¯Ã ¤ò†¾-ÂÃ©Õ E¢œËÊ ‚£¾Éª½¢ B®¾Õ-Âî-«œ¿¢ ÅŒX¾p-E-®¾J ÆE EX¾Û-ºÕ©Õ ®¾Ö*-®¾Õh¢-šÇª½Õ. Æ¢Åä-Âß¿Õ.. ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ ’¹ÕJ¢* Æ¢Ÿ¿-JÂÌ Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢Íä …Ÿäl-¬Á¢-Åî¯ä èÇB§ŒÕ ¤ò†¾-ÂÃ-£¾Éª½ CÊ¢, èÇB§ŒÕ ¤ò†¾-ÂÃ-£¾Éª½ «Ö®¾¢, “X¾X¾¢ÍŒ ¤ò†¾-ÂÃ-£¾Éª½ CÊ¢.. «¢šË X¾©Õ “X¾Åäu¹ ªîV Â¹ØœÄ Eª½y-£ÏÇ-®¾Õh¢-šÇª½Õ. ¯äœ¿Õ “X¾X¾¢ÍŒ ¤ò†¾-ÂÃ-£¾Éª½ C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¤ò†¾-ÂÃ-©Åî E¢œË …Êo ®¾ÖX¾-ªý-X¶¾Ûœþ ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala