అమ్మలకు, అమ్మాయిలకు ఈ గింజలతో ప్రయోజనాలెన్నో..!
ప్రగతికి నాలుగు నెలల పాప ఉంది. ముందు నుంచీ తన జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండేది. కానీ ప్రసవమయ్యాక మాత్రం తన జుట్టు విపరీతంగా రాలుతోంది. బాబు పుట్టాక మధురిమ విపరీతమైన బరువు పెరిగింది. ప్రసవం తర్వాత ఇది సర్వసాధారణమే అయినప్పటికీ.. తానెంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని, అందరూ ‘ఏంటి.. ఇంత లావుగా తయారయ్యావ్!’ అంటూ ఆశ్చర్యపోతున్నారని చెబుతోంది. తల్లయ్యాక ప్రతి మహిళలోనూ ఇలాంటి శారీరక మార్పులు సహజమే. ఈ క్రమంలోనే తమ అందం, అధిక బరువు గురించి ఆందోళన చెందుతూ ఒత్తిడి-ఆందోళనలకు గురవుతుంటారు చాలామంది అతివలు. అయితే ఇలాంటి ప్రసవానంతర సమస్యలకు పరిష్కారం చూపే అద్భుత ఔషధం, అందులోని సుగుణాలేంటో ఇటీవలే సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. అంతేకాదు.. ఆ పదార్థంపై చాలామందిలో నెలకొన్న సందేహాలకు సోషల్ మీడియా పోస్ట్ రూపంలో బదులిచ్చారు కూడా! మరి, ఇంతకీ ఏంటా ఔషధం? దాని గురించి రుజుత ఏమంటున్నారు? తెలుసుకుందాం రండి..
Know More