అతడే నా ఆల్‌టైమ్ క్రష్!
అందంలోనూ, అభినయంలోనూ శ్రీదేవికి నిజమైన వారసురాలిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చకుంటోంది జాన్వీ కపూర్. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే విమర్శకులను ఆకట్టుకుంది. ఇంకా రెండో చిత్రం విడుదల కాకముందే పలు సినిమాలకు సంతకం చేసి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటోందీ అందాల తార. ఇటీవల ‘బెల్లీ డ్యాన్స్’తో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ తాజాగా ‘నో ఫిల్టర్ నేహా’ అనే ఓ టాక్ షోకు హాజరైంది. బాలీవుడ్ భామ నేహా ధూపియా నిర్వహిస్తున్న ఈ షోలో టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, తన ఫస్ట్ హీరో ఇషాన్ ఖత్తర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది జాన్వీ.
Know More