సహజంగానే పండించారా?
వేసవి కాలమంటేనే భరించలేని వేడి. ఇంతటి ఉక్కపోతలోనూ అందరి దృష్టీ మామిడి పండ్లపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఎందుకంటే నోరూరించే తియ్యతియ్యటి మామిడిపండ్లు దొరికే సీజన్ ఇదే కదా..! ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో, రహదారుల పక్కన, సూపర్మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో.. ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి. చక్కటి పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే.. ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా..! అయితే ఇటీవలి కాలంలో మామిడిపండ్లు మన ఆరోగ్యానికి హానికారకంగా మారుతున్నాయి. దీనికి కారణం వాటిని త్వరగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం కార్బైడ్(కార్సినోజెన్) వంటి రసాయనాలు ఉపయోగించడమే. ఫలితంగా క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే సహజసిద్ధమైన పద్ధతిలో పండిన వాటిని మాత్రమే తినాలి. మరి మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్న కాయల్లో ఏది సహజసిద్ధంగా పండిందో.. దేన్ని రసాయనాలు ఉపయోగించి పండించారో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాల్సిందే..!
Know More