అప్పుడే నా తలపైకి ఎక్కి కూర్చుంది..!
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నందితా శ్వేత. ఈ సినిమాలో దెయ్యం పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు తన అందంతో మెస్మరైజ్ చేసింది. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైందీ కన్నడ బ్యూటీ. ఇక తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తోన్న నందిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈక్రమంలోనే తాజాగా నందిత ఓ ఫొటోను పోస్ట్ చేసింది. చేతిలోని పువ్వును తదేకంగా చూస్తున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేస్తూ ‘మిమ్మల్ని మీరు ఒక పువ్వులా భావించండి..! ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది.,!’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక మరో ఫొటోను పోస్ట్ చేసిన నందిత ‘మీరు చేయాలనుకుంటున్న దానిపైనే దృష్టి పెట్టండి. ఇతరులు ఏం చేస్తున్నారన్న దానిపై కాదు..!’ అని రాసుకొచ్చింది.
Know More