వర్షాకాలంలో మేము ఇలా జాగ్రత్త పడుతున్నాం.. మరి, మీరు?
చిటపట చినుకులతో శరీరాన్ని పులకరింపజేసే వర్షాకాలమంటే చాలామంది అమ్మాయిలకు ఇష్టమే. అందుకే వర్షం పడుతోందంటే చాలు.. ఎక్కడున్నా వానలో తడుస్తూ చిందులేస్తుంటారు. అయితే ఈ కాలం ఇలా ఎంజాయ్‌మెంట్‌తో పాటు వివిధ రకాల వ్యాధుల్ని కూడా మోసుకొస్తుంది. అసలే ఈ సీజన్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల త్వరగా జబ్బు పడే ప్రమాదం ఎక్కువ. ఇక దీనికి తోడు ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తోంది. కాబట్టి ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు మన మన అభిమాన యాంకర్లు ఝాన్సీ, అనసూయలు.
Know More