సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ మధ్యాహ్నం నేనెప్పటికీ మర్చిపోలేను !

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుటుంబ సమేతంగా ఇటీవలే భారత పర్యటనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. వీళ్లు దిల్లీలో పర్యటించిన ఆ రెండురోజులూ అక్కడే కాదు.. దేశమంతా సందడి నెలకొంది. అయితే ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు ట్రంప్‌ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ.. మెలానియా ట్రంప్‌ దిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు ఆమెను సంప్రదాయబద్ధంగా, ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు. ఆపై అక్కడి విద్యార్థులు చేసిన నృత్యాలు, పాఠశాలలో నిర్వహించే ‘హ్యాపీనెస్‌ కరిక్యులం’ క్లాసులు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత పర్యటన తనకెన్నో మధురానుభూతుల్ని మిగిల్చిందని, ముఖ్యంగా సర్వోదయ పాఠశాలలోని విద్యార్థులు, అక్కడి హ్యాపీనెస్‌ తరగతులు తనలో ఎంతగానో స్ఫూర్తి నింపాయని అమెరికాకు వెళ్లాక ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు మెలానియా. అంతేకాదు.. ఈ క్రమంలో ఆమె ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.

Know More

women icon @teamvasundhara

ఈ ట్రంప్‌ లేడీస్‌ పర్యటన ఆద్యంతం ఆసక్తికరం !

ఎక్కడికెళ్లినా ఆకట్టుకునే ఆహార్యం.. మోముపై చెరగని చిరునవ్వు.. అగ్రరాజ్య అధ్యక్షుడి కుటుంబ సభ్యులైనా ఇసుమంతైనా దర్పం ప్రదర్శించని వైనం.. వెరసి తమ రెండు రోజుల భారత పర్యటనలో పడమటి నెలవంకలు మెలానియా ట్రంప్‌, ఇవాంకా ట్రంప్‌లు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా గడిపారు. దిల్లీలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ, ఫొటోలకు పోజిస్తూ, సందర్శకులతో సరదాగా సెల్ఫీలు దిగుతూ.. అందరి మనసులూ గెలుచుకున్నారీ వైట్‌ బ్యూటీస్‌. పాశ్చాత్య డ్రస్సులకు భారతీయ ఫ్యాషన్లను మేళవిస్తూ మన దేశ ఆడపడుచుల మనసులు గెలుచుకున్నారీ లవ్లీ లేడీస్‌. మరి, ఆద్యంతం ఆసక్తికరంగా, బిజీబిజీగా గడిపిన ఈ ట్రంప్‌ లేడీస్‌ రెండు రోజుల భారత పర్యటనలోని కొన్ని ముఖ్య ఘట్టాలకు ప్రత్యక్ష సాక్ష్యాలీ ఫొటోలు..! మరి, మీరు కూడా ఓ లుక్కేయండి!

Know More

women icon @teamvasundhara

ఈ ‘హ్యాపీనెస్‌’ ను అమెరికాకు మోసుకెళ్తున్నా!

‘హ్యాపీనెస్‌ కరిక్యులం’... దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్‌ తరగతులతో పాటు అమలవుతున్న ఓ స్పెషల్‌ ప్రోగ్రాం. విద్యార్థుల్లో సృజనాత్మకతను మెరుగుపరిచే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మంచి సత్ఫలితాలనిచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఈ ‘హ్యాపీనెస్‌ క్లాస్‌’ కు హాజరయ్యారు. తరగతి గదుల్లోకి వెళ్లి చిన్నారులతో కలిసి సరదాగా ముచ్చటించిన ఆమె కొద్దిసేపు హ్యాపీనెస్‌ పాఠాలు విన్నారు. ఇక మెలానియా రాకతో ఆ ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది.

Know More

women icon @teamvasundhara

ఈ అందాల నెలవంకల ఫ్యాషన్లు ఎంత ప్రత్యేకమో !

ప్రపంచంలోని ఏ దేశ మహిళలకైనా.. భారతీయ దుస్తులు ఇట్టే నప్పేస్తాయని, వారు ఆ దుస్తుల్లో భువికి దిగొచ్చిన దేవకన్యల్లా అత్యద్భుతంగా కనిపిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం భారత పర్యటనలో బిజీబిజీగా గడుపుతోన్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, ఇవాంక ట్రంప్‌ ధరించిన ఫ్యాషన్లను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఓవైపు మోడ్రన్‌గా, హుందాగా కనిపిస్తూనే .. మరోవైపు వాటికి భారతీయ శైలిని అద్ది తమ ఫ్యాషన్‌ సెన్స్‌తో ఇక్కడి ఫ్యాషన్‌ ప్రియులను ఫిదా చేస్తున్నారీ అమెరికన్‌ లేడీస్‌. అంతేకాదు.. ఇలా తమవైన ఫ్యాషన్లతో భారతదేశంపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారీ పవర్‌ఫుల్‌ ఉమెన్‌. మరి, భారత పర్యటనలో భాగంగా తమ సింపుల్‌ కమ్‌ ఇండో-ట్రెడిషనల్‌ లుక్స్‌తో ఫ్యాషన్‌ ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమెరికన్‌ అందాలు ధరించిన ఫ్యాషన్స్‌లో ఎన్నో ఆసక్తికర విశేషాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ట్రంప్‌ జీవితంలో ఆ అయిదుగురు !

‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ కచ్చితంగా ఉంటుంది..’ అన్నది జగమెరిగిన సత్యం. అయితే అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రెసిడెన్షియల్‌ జర్నీ వెనుక ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు మహిళలున్నారు. వారెవరో కాదు.. ఆయన ముగ్గురు భార్యలు, ఇద్దరు కూతుళ్లు. వారంతా ఓవైపు తమ తమ రంగాల్లో రాణిస్తూనే.. మరోవైపు ట్రంప్‌ అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుతం ట్రంప్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన జీవితంలో పెనవేసుకున్న ఆ ఐదుగురు మహిళా మణుల గురించి స్పెషల్‌ స్టోరీ మీకోసం..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala