నువ్వు మళ్లీ పుడతావ్.. విజయం సాధిస్తావ్!
ఈ రోజు ఇన్స్టాపురములో బాలీవుడ్ భామలు అనుష్కా శర్మ, కరీనా కపూర్ గల్వాన్ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ‘ఒక జవాను వీర మరణం పొందితే దాన్ని జీర్ణించుకోవడం ఎంత కష్టమో, ఆ బాధ ఎలా ఉంటుందో.. ఒక సైనికుడి కూతురిగా నాకు తెలుసు.. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబానికి దూరంగా ఉండి చేసే ఈ త్యాగం అసమానమైనది. ఈ సమయంలో శాంతి నెలకొనాలని, వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.. జై జవాన్’ అంటూ తన గుండెల్లోని దేశభక్తిని చాటింది అనుష్క.
Know More