కొబ్బరిపాలతో కొంగొత్త అందం..!
అందమైన అమ్మాయిని చూడగానే ఎవరైనా సరే- 'పచ్చి పాల మీగడ.. అచ్చ తెలుగు ఆవడ..' అంటూ ఆ అందాల్ని పొగిడేయాల్సిందే..! అయితే అందరూ అంతగా మెచ్చుకునే ఆ అందాన్ని సంరక్షించుకోవడానికి కొబ్బరి పాలు కూడా ఉపయోగపడతాయని మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? కొబ్బరి పాలను ఎలా ఉపయోగిస్తే సౌందర్యపరమైన ప్రయోజనాలు సొంతమవుతాయో తెలుసుకుందాం రండి.. కొబ్బరిపాలలో విటమిన్ ఎ, సి, క్యాల్షియం, ఐరన్, సహజ ప్రొటీన్స్.. ఇలా ఎన్నో పోషకాలు ఉండటం వల్ల వీటిని సౌందర్య సంరక్షణకు నిస్సందేహంగా ఉపయోగించవచ్చు.
Know More