సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అందాల ముద్దుగుమ్మలు బొమ్మలైతే ఇలా ఉంటుంది!

‘పట్టు చీరల్లో చందమామ.. ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ.. కన్నె రూపాల కోనసీమ.. కోటి తారల్లో ముద్దుగుమ్మ..!’ ఈ సాహిత్యం వింటే మన కళ్ల ముందు కదలాడే రూపం.. కాజల్‌ది కాక ఇంకెవరిది..! 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. పరిశ్రమకు వచ్చి 13 ఏళ్లు దాటినా ప్రేక్షకుల్లో కాజల్‌కి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం చెక్కు చెదర్లేదు. ఈ క్రమంలో ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించే మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థ కాజల్‌ విగ్రహాన్ని రూపొందించే క్రమంలో కొద్ది రోజుల క్రితమే కాజల్‌ శరీర కొలతలను తీసుకున్న సంగతి విదితమే. అయితే తాజాగా ఈ విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాజల్‌ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Know More

women icon @teamvasundhara

నీకు వందేళ్లు వచ్చినా ఇదే చెబుతా!

వివిధ రంగాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి తమ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతుంది మేడమ్‌ టుస్సాడ్స్‌ బృందం. ఈ క్రమంలో ఇప్పటికే భారతదేశానికి చెందిన కొంతమంది ప్రముఖుల మైనపు విగ్రహాలను వీళ్లు ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ, సచిన్‌ టెందుల్కర్‌, విరాట్‌ కోహ్లీ, అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, అనుష్కా శర్మ, దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా.. తదితరుల మైనపు విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ బృందం రూపొందించగా వాటిలో దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటివరకు ప్రభాస్‌ ఒక్కరే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో ఇటీవలే మరో సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ ఈ గౌరవానికి ఎంపికైంది. తనెవరో కాదు.. టాలీవుడ్‌ అందాల ‘చందమామ’ కాజల్‌ అగర్వాల్‌. దక్షిణ సినీ పరిశ్రమ నుంచి ఈ గౌరవం అందుకున్న తొలి హీరోయిన్‌గా కాజల్‌ చరిత్రకెక్కడం విశేషం. ఈ నేపథ్యంలో కాజల్‌ మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు అవసరమయ్యే శారీరక కొలతలను ఇటీవలే తీసుకుంది టుస్సాడ్స్‌ బృందం.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala