జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా బంగారం!
ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా తమలో తాము మాట్లాడుకోవడం, ముసిముసిగా నవ్వుకోవడం, ప్రేమించిన వారి తలపుల్లో తడిసిపోవడం.. ఇలా ఆ బంధంలోని తియ్యదనం వర్ణనాతీతం. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి పుట్టిందే ప్రేమికుల దినోత్సవం. ఒక్కరోజు కాదు.. ఏకంగా ఏడు రోజుల పాటు జరుపుకొనే ఈ వేలంటైన్ వీక్లో ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో ప్రేమికులు పరస్పరం చేసుకునే ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది ‘ప్రామిస్ డే’. అయితే ఇలాంటి వాగ్దానాలు చేసుకోవడానికి ‘ప్రామిస్ డే’ లాంటి ప్రత్యేక సందర్భాలే ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమను పంచుకోవడానికైనా, పెంచుకోవడానికైనా అనునిత్యం, అనుక్షణం ప్రత్యేకమైనదే. కాబట్టి మీరు చేసుకున్న బాసలేవైనా.. వాటికి కట్టుబడి, వాటిని నిలబెట్టుకున్నప్పుడే ఇద్దరూ హ్యాపీగా ఉండగలుగుతారు.. ఆ బంధమూ శాశ్వతమవుతుంది.
Know More