సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ హెల్దీ డైట్‌తో వేసవి సమస్యలను అధిగమించండి!

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల సీజనల్‌ వ్యాధులు, చర్మం జిడ్డుగా మారిపోవడం, కంది పోవడం, స్కిన్‌ అలర్జీలు, ట్యానింగ్‌ సమస్యలు అధికంగా ఎదురవుతుంటాయి. వీటికి తోడు కరోనా ఇంకా మనల్ని వెంటాడి వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon @teamvasundhara

ఈ ఆలోచనలు మానండి.. ఆనందంగా ఉండండి..!

జీవితం ఎప్పుడూ సంతోషంగా.. ఆనందంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. దానికోసం వడివడిగా సాగిపోతోన్న కాలంతో కలిసి పరిగెత్తుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం. అయితే వాటికి కూడా కుంగిపోయి.. తమ జీవితం అంతా కష్టాలమయమైపోయిందని బాధపడేవారు కూడా ఉంటారు. ఈ క్రమంలో తమకంటే కాస్త మిన్నగా ఉన్నవారితో పోల్చుకొని తమను తాము తక్కువ చేసి చూసుకొంటారు. ఈ రకమైన ఆలోచనా విధానం కారణంగా.. ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలనే విషయాన్ని కూడా మరిచిపోతుంటారు. ఇలా చేయడం సరికాదు. అయితే మన మెదడులో మెదిలే కొన్ని ఆలోచనలకు దూరంగా ఉండటం ద్వారా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు.

Know More

women icon @teamvasundhara

పీసీఓఎస్‌ ఉంటే ఈ సౌందర్య సమస్యలు తప్పవా?!

అందంగా ఉండాలనేది మహిళల ఆరాటం. కానీ ఎంత కాపాడుకున్నా సౌందర్యం విషయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. ఇందుకు పలు అనారోగ్యాలు కూడా కారణమవుతుంటాయి. పీసీఓఎస్‌ కూడా వీటిలో ఒకటి. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు దీంతో బాధపడుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు.. దీని కారణంగా నెలసరి సమస్యలు, సంతానలేమితో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం.. ఇలా అందం పరంగానూ ప్రతికూల ప్రభావం చూపుతోందీ సమస్య. మరి, అసలు పీసీఓఎస్‌ వస్తే సౌందర్య సమస్యలెందుకొస్తాయి? వీటిని దూరం చేసుకోలేమా? తిరిగి అందాన్ని పెంపొందించుకోలేమా? అంటే అది సాధ్యమే అంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అదొక్కటీ బాగుంటే అన్నిట్లోనూ మీరే టాప్.. అదేమిటో తెలుసా?

మనం ఒక పని విజయవంతంగా చేయాలంటే ఏముండాలి? కృషి, దీక్ష, పట్టుదల.. ఆగండాగండి.. దీని గురించి మీకు చాలా తెలుసన్న విషయం అర్థమైపోయింది.. వీటన్నింటితో పాటు ఇంకేముండాలి? ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదేనండీ.. ఆరోగ్యం! మనం చాలాసార్లు వింటూనే ఉంటాం కదా.. 'హెల్త్ ఈజ్ వెల్త్' అని! ఎన్నున్నా ఆరోగ్యం బాగుండకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఆరోగ్యంగా ఉంటేనే శరీరం, మనసు చేసే పనిపై దృష్టి సారించగలుగుతాయి. అందుకే ఉద్యోగం లేదా వ్యాపారంలో సక్సెస్ సాధించాలన్నా సంపూర్ణ ఆరోగ్యం తప్పనిసరి! అయితే మన దినచర్య ప్రణాళికాబద్ధంగా, నియమబద్ధంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మరిలాంటి హెల్దీ లైఫ్‌స్త్టెల్ కోసం ఏం చేయాలి? ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోతుంటే..

'ప్రేమనేది లైఫ్‌లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు..' శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందా? ప్రేమే జీవితం కాకపోయినా... ప్రేమలో విజయం సాధిస్తే ఎంత ఆనందం మన సొంతమవుతుందో.. ఒకవేళ అందులో విఫలమైతే.. అంతకంటే రెట్టింపు విషాదం మనల్ని చుట్టుముడుతుంది. ప్రేమించిన వ్యక్తిని, వారి సాహచర్యంలో చోటుచేసుకున్న సంఘటనలను మర్చిపోవడం అంత సులభం కాదు. అలాగని పదేపదే వారిని, వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి ఆ జ్ఞాపకాల్లోంచి వీలైనంత త్వరగా బయటపడి మామూలు మనిషిగా మారాలి. అప్పుడే ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండదు. మరి అందుకూ కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

‘డ్రీమ్‌ జాబ్’ గురించి అపోహలు వద్దు !

ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. దాన్నే ఉపాధిగా మలచుకుని డబ్బు సంపాదిస్తే.. అదే డ్రీమ్‌ జాబ్‌. కానీ చాలామందికి డ్రీమ్‌ ఒకటుంటే చేసే ఉద్యోగం మరొకటి ఉంటుంది. ఈక్రమంలో జీవితమంతా ఏదో ఉదాసీనతతో ఉంటుంటారు. అయితే నిజంగా ఇలా డ్రీమ్‌ జాబ్‌ దొరక్కపోతే బాధపడాలా ? డ్రీమ్‌ జాబ్‌ సంపాదించిన వారు చాలా సంతోషంగా ఉంటున్నారా ? అంటే... చాలావరకు కాదు అనే సమాధానం వస్తుంటుంది. ఎందుకంటే డ్రీమ్‌ జాబ్‌ సంపాదించిన అందరూ కూడా ఆ ఉద్యోగంలో టార్గెట్స్‌ చేరుకోలేక ఒత్తిడికే గురవుతుంటారు. ఇక డ్రీమ్‌ జాబ్‌ రాకపోయినా ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి పొందుతున్న వారు ఎంతమందో ఉన్నారు. అందుకే మీ జీవితంలో డ్రీమ్‌ జాబ్‌ గురించి ఉండే కొన్ని అపోహలను తొలగించుకోండి అంటున్నారు మానసిక నిపుణులు. మరి ఆ సంగతేంటో చూద్దాం రండి...

Know More

women icon @teamvasundhara

నేను చేసిన తప్పులు నా కూతురు అస్సలు చేయదు!

స్వశక్తితో సొంత కాళ్లపై నిలబడినా... వ్యక్తిగతంగా ఎంత ఎత్తుకు ఎదిగినా విడాకులు తీసుకున్న స్త్రీలంటే ఈ సమాజంలో కాస్త చిన్నచూపు ఉంటుంది. వాళ్లేదో తప్పు చేశారన్నట్లుగా చాలామంది వారిని చులకన భావంతో చూస్తుంటారు. తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితాన్ని వారి పిల్లలకు ముడిపెడుతూ సూటిపోటి మాటలతో అవమానాలకు గురిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో తాను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా నేటికీ తాను, తన పిల్లలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నామంటోంది ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారీ. తన అందం, అభినయంతో బాలీవుడ్‌ బుల్లితెరను ఏలుతోన్న ఈ ముద్దుగుమ్మ రెండుసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం సింగిల్ మదర్‌గానే కొనసాగుతోన్న ఆమె.. ఓవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈక్రమంలో తన విడాకుల వ్యవహారం, పిల్లలపై దాని ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon @teamvasundhara

ఇంటి నుంచి పని.. అలసట అందుకేనా?!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కరోనా కాలంలో బాగా ట్రెండ్‌ అవుతోన్న ఈ పని విధానం కారణంగా ఇంటి పట్టునే ఉంటూ హాయిగా పనిచేసుకోవచ్చు. అయితే ఇందులో పలు సమస్యలూ లేకపోలేదు. నిరంతరాయంగా కూర్చొనే ఉండడం, ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, సరైన పని వాతావరణం లేకపోవడం.. ఇలా వీటి మూలంగా చాలామంది ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. ఇలా అలసటకు గురవుతోన్న వారి సంఖ్య సుమారు 35 శాతంగా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక మరో 32 శాతం మంది పని ఒత్తిడిని తట్టుకోలేక అప్పుడప్పుడూ నీరసిస్తున్నారని వెల్లడైంది. ఏదేమైనా దీని ప్రభావం అంతిమంగా వారి అవుట్‌పుట్‌పై పడుతుందని.. కాబట్టి ఈ అలసటను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదంటున్నారు. మరి, ఇంతకీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే క్రమంలో ఎదురయ్యే అలసటకు కారణాలేంటి? దాన్ని దూరం చేసుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇలా చేస్తే.. మీ సంతోషం మీ చేతుల్లోనే!

జీవితాంతం హ్యాపీగా గడిపేయాలని ఎవరికుండదు చెప్పండి? అయితే వూహించని సమస్యలు... ఒడిదుడుకులు... జీవితమన్నాక కామన్. కాకపోతే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుంగిపోకుండా వెంటనే దాని నుంచి తేరుకుని మామూలు మనిషి కావడం కొంతమందికి తక్కువ సమయంలోనే సాధ్యమవుతుంది. మరికొందరు మాత్రం పూర్తిగా ఆ సమస్యలోనే కూరుకుపోయి నిరాశలోకి జారుకుంటారు. ఆలోచనా దృక్పథంతో పాటు జీవనశైలినీ మార్చుకోగలిగితే-ఉన్నంతలో సంతోషంగా ఉండడం అసాధ్యం కాదు... ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ సందర్భంగా - మరి మన జీవితంలో సంతోషంగా ఉండడం ఎలాగో చూద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon @teamvasundhara

ఒకే కిడ్నీ ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

అవయవ దానం అన్నింటికన్నా గొప్పదంటుంటారు. తాము చనిపోతూ ఆపదలో ఉన్న వ్యక్తికి తమ అవయవాలను దానమిచ్చే ప్రాణదాతలు కొందరైతే.. బతికుండగానే తమ శరీరంలోని జంట అవయవాల్లో ఒక దాన్ని దానం చేస్తూ దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మరికొందరు. అయితే ఇలాంటి అవయవ దానాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం మంది ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ కిడ్నీ దానమిచ్చే దంపతుల్లో (Spousal Kidney Donors) మహిళలదే పైచేయి అని, వారి వాటా 90 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇక తమ తండ్రులకు కిడ్నీ దాతలుగా మారిన కూతుళ్లు 39 శాతంగా ఉన్నట్లు అదే అధ్యయనంలో రుజువైంది. ఏదేమైనా మన శరీరానికి రెండు కళ్లుగా భావించే రెండు కిడ్నీల్లో నుంచి ఒకటి దానమిస్తే ఒక్కోసారి అంతకుముందున్నంత సౌకర్యంగా మెలగలేకపోవచ్చు. ఈ క్రమంలో ఉన్న ఒక్క కిడ్నీని ఆరోగ్యంగా కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ‘అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం’ సందర్భంగా ఒక్క కిడ్నీతో జీవితం గడుపుతోన్న వారు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీవనశైలిలో ఏయే మార్పులు చేసుకోవాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

Know More

women icon @teamvasundhara

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

శరీరంలోని అత్యంత సున్నితమైన, ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి మన రక్తంలోని మలినాలన్నింటినీ వడకడుతూ... శరీరానికి అత్యంత రక్షణ కలిగిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి కిడ్నీల పనితీరు మందగిస్తే మళ్లీ పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. పైగా డయాలసిస్‌ లాంటి చికిత్సలకు ఎంతో ఖర్చవుతుంది. ఇక దెబ్బతిన్న మూత్ర పిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే దాతలు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో అనారోగ్యకరమైన జీవనశైలి, అలవాట్ల కారణంగానే చాలామంది అతి తక్కువ వయసులోనే కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ‘అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం...

Know More

women icon @teamvasundhara

ఉద్యోగం మానకుండానే ఇలా బ్యాలన్స్ చేయండి..!

స్వప్న ఎంబీయే చేసి ఓ పెద్ద కంపెనీలో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేస్తోంది. జీతం ఆరంకెల్లో ఉంటుంది. అయినా తనెప్పుడూ ఆనందంగా ఉండటం ఎవరూ చూడలేదు. కారణం తన ఉద్యోగంలో ఆమెకు సంతృప్తి లేక కాదు.. దీనివల్ల పిల్లలకు దూరమవుతున్నాననే బాధ.. తను ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీసుకొస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందేమో.. ఇంటికి బయల్దేరేసరికి ఆలస్యమవుతుంది. ఇంటికి వెళ్లే సరికి పిల్లలు నిద్రపోయే మూడ్‌లో ఉంటారు.. వాళ్లతో కలిసి గడపలేకపోతున్నానని, వాళ్ల చదువుల్లో సహాయం చేయలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటుంది స్వప్న. అయితే తన ఆర్థిక స్థితి బాగుండాలంటే ఉద్యోగం తప్పనిసరి. అందుకే ఉద్యోగం చేయలేక, మానలేక ఇబ్బంది పడుతోంది స్వప్న. కరోనా నేపథ్యంలో ఇటీవల కొన్ని నెలల పాటు ఇంటి నుంచే పని చేసినా, ఇప్పుడు మళ్లీ ఆఫీసుకు వెళ్లాల్సి రావడంతో పిల్లల గురించి స్వప్న బాధ మళ్లీ మొదలైంది.

Know More

women icon @teamvasundhara

ఇరవైల్లో ఇవి చేయాల్సిందే..!

ప్రతి మనిషి జీవితంలోనూ అత్యంత ముఖ్యమైన వయసు ఏది? అంటే ఇరవైలని చెప్పుకోవచ్చు. 20-29 ఏళ్ల వయసును ఇరవైల వయసుగా పరిగణిస్తాం.. ఈ వయసులోనే జీవితంలో అతి ముఖ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. అమ్మాయిలకైతే ఇవి మరింత ఎక్కువని చెప్పుకోవచ్చు. చదువు, ఉద్యోగం, వివాహం.. మరికొందరికైతే పిల్లలు కూడా..! అందుకే ఈ వయసు చాలా ముఖ్యమైనది. అయితే చాలామంది ఇరవైల్లో చేయాల్సిన కొన్ని పనులను మాత్రం చేయకుండా వదిలేస్తుంటారు. దీనివల్ల కాస్త వయసు పెరిగిన తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే ఇరవైల్లోనే చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో.. తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఆ అలవాట్లే నాకు కరోనాతో పోరాడే శక్తినిచ్చాయి!

ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూపోతోంది. ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్‌’, ‘మ్యుటేషన్‌’ అంటూ తన రూపాన్ని, ఉనికిని మార్చుకుంటూ లక్షలాది మందిని తన బాధితులుగా చేర్చుకుంటోంది. వివిధ దేశాలతో పాటు మనదేశంలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తుండడం కొవిడ్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో ఎక్కడ ఈ వైరస్‌ సోకుతుందేమోనని రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తెగ ఆందోళన చెందుతున్నారు. అయితే మరోపక్క ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగలమని ఇప్పటికే ఎందరో శతాధిక వృద్ధులు నిరూపిస్తున్నారు. తద్వారా తమ లాంటి బాధితులకు బతుకుపై ఆశలు కల్పిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన లూసియా డిక్లెర్క్‌ అనే వృద్ధురాలు. 105 ఏళ్ల వయసున్న ఈ బామ్మ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే రెండు ప్రపంచ యుద్ధాలతో పాటు స్పానిష్ ఫ్లూ సంక్షోభాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె మనోధైర్యం ముందు కొవిడ్‌ మహమ్మారి నిలవలేకపోయింది.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala