ఈ లాక్డౌన్లో వయసును ‘లాక్’ చేయండిలా!
ఆఫీసుకు వెళ్లేటప్పుడు మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకుందామన్నా సమయం దొరికేది కాదు. ఇంటి పని, వంట పనికి తోడు భర్తను ఆఫీస్‌కి పంపడం, పిల్లల్ని రడీ చేసి స్కూల్‌కి పంపడం.. ఇలా వీటితోనే సరిపోయేది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక మళ్లీ ఇంటి పని షరా మామూలే. అంతటి బిజీ లైఫ్స్టైల్లో అందాన్ని సంరక్షించుకోవడానికి ఓ అరగంటైనా సమయం ఉండేది కాదు. కానీ లాక్డౌన్ మొదలైనప్పట్నుంచి ఇంట్లో పని పెరిగినా, ఇంటి నుంచి పనిచేసినా కొంతమందికి కాస్తో కూస్తో ఖాళీ సమయం దొరికే అవకాశం ఉండచ్చు. అలాంటి అవకాశం ఉన్నవారు ఇలా దొరక్క దొరక్క దొరికిన ఆ సమయంలో మనం చేయాలనుకున్న పనులు చేసుకోవచ్చు. అందులో అందాన్ని సంరక్షించుకోవడం కూడా ఒకటి. చాలామంది చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడుతున్నాయని దిగులు పడుతుంటారు. అలాంటి వారు ఈ వంటింటి ఔషధాలను ఉపయోగించుకొని నవ యవ్వనంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
Know More