సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వారి కోసం రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తోంది!

ఆమె ఒక సాదాసీదా అంగన్‌వాడీ కార్యకర్త. గర్భిణులు, కొత్తగా తల్లైన మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారం అందించడం ఆమె విధి. ఇలా తన రోజువారీ విధులు నిర్వర్తిస్తోన్న క్రమంలోనే అనుకోకుండా ఈ కరోనా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. దాంతో అటు గర్భిణులు, ఇటు బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడానికి భయపడిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తన పనులేవో తాను పూర్తి చేసుకొని, ఇతర విషయాలను పట్టించుకోకపోయినా ఆమెను ఎవరూ ఏమీ అనరు.. పైగా ప్రభుత్వం నుంచి అందాల్సిన జీతం కూడా సరైన సమయానికి అందుతుంది. కానీ ఇవేమీ ఆలోచించలేదామె. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి రాకపోతేనేం.. నేనే వాళ్ల దగ్గరికి వెళ్తానని నిశ్చయించుకుంది. అలా దాదాపు ఏడు నెలలుగా ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తూ గర్భిణులకు, బాలింతలకు కావాల్సిన పోషకాహారం అందిస్తోందామె. అది కూడా రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తూ మరీ! ఇలా పని పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతోంది కాబట్టే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, ఇంతకీ ఎవరామె? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

«á®Ïx¢ «Õ£ÏÇ@Á©Â¹× ‚ÅŒt-ª½-¹~º NŸ¿u©Õ ¯äª½Õp-Åî¢C..

ƒšÌ-«L Â颩𠧌âªîXý Ÿä¬Ç©ðx …“’¹-„Ã-Ÿ¿Õ© Ÿ¿«Õ-Ê-Â✿ åXJ-T-¤ò-ŌբC. ²Ä«Ö-ÊÕu-©åXj ÅŒ«Õ X¾¢èÇ N®¾Õ-ª½Õ-ÅŒÕ-¯Ãoª½Õ. «Öª½-ºÇ-§Œá-ŸµÄ-©Åî ‡¢Åî-«Õ¢C “¤ÄºÇ-©ÊÕ ¦L B®¾Õ-Âí¢-{Õ-¯Ãoª½Õ. ƪáÅä ‚ “X¾¦µÇ«¢ ƹˆ-œËÅî ‚T-¤ò-©äŸ¿Õ. …“’¹-„Ã-ŸÄ-EÂË Ÿ¿Öª½¢’Ã.. ²ÄŸµÄ-ª½º °«Ê¢ ²ÄT-²òhÊo «á®Ïx¢©åXj Â¹ØœÄ X¾œ¿Õ-Åî¢C. §ŒâªîXý „î¾Õ©Õ „ÃJE ÅŒ«Õ ¬Á“ÅŒÕ-«Û-©Õ’à ¦µÇN-®¾Õh-¯Ãoª½Õ. „ÃJåXj ŸÄœ¿Õ-©Â¹× Åç’¹-¦-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÅŒ«Õ Ÿä¬ÇEo «CL „çRx-¤ò-«ÕE å£ÇÍŒa-J-®¾Õh-¯Ãoª½Õ. ƒ©Ç Í䧌Õ-œÄ¯äo 'ƒ²Äx„çÖ¤¶òG§ŒÖÑ’Ã «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ. DE Âê½-º¢’à «á®Ïx¢-©åXj •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ŸÄœ¿Õ©Õ ’¹ÅŒ Âí¢ÅŒ Â颒à åXª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ão§äÕ ÅŒX¾p ÅŒ’¹_œ¿¢ ©äŸ¿Õ. “G{-¯þ-©ðÊÖ ƒ©Ç¢šË X¾J-®ÏnÅä ¯ç©Âí¢C. ‚ Ÿä¬Á ªÃ•-ŸµÄE ©¢œ¿-¯þ©ð ƪáÅä ’¹ÅŒ¢©ð ‡Êoœ¿Ö ©äE-N-Ÿµ¿¢’Ã.. ƒ²Äx-„çÖ-¤¶ò-G§ŒÖ «©x •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ŸÄœ¿Õ©ðx 70] „äÕª½ åXª½Õ-’¹Õ-Ÿ¿© ¹E-XÏ¢-*¢C. £ÏÇ•-¦üÅî ‡«ª½Õ ¹E-XÏ¢-*¯Ã „ÃJåXj ÍäA-¹¢CÊ «®¾Õh-«Û-©Åî ŸÄœ¿Õ-©Â¹× ¤Ä©p-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ©Ç¢šË X¾J-®Ïn-Ōթðx «á®Ïx¢ «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«ÕÊÕ ÅÃ«á ª½ÂË~¢-ÍŒÕ-Âí¯ä©Ç „ÃJÂË P¹~º ƒ²òh¢C ÈCèÇ ®¾¤¶ÄK. «á„çýÕ Ÿ±Ä§ýÕ ÂËÂú-¦Ç-ÂËq¢’û, NÕÂúqœþ «Öª½¥©ü ‚ªýdq©ð “¤ÄO-ºu-«áÊo ‚„çÕ.. ÅŒ«ÕÊÕ ÅÃ«á ª½ÂË~¢-ÍŒÕ-Âí-¯ä©Ç ÅŒ«Õ ÅîšË «Õ£ÏÇ@ÁLo BJa-C-Ÿ¿Õl-Åî¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala